BJP Worker Pahalgam Attack| 26 మంది పర్యాటకులను బలితీసుకున్న పహల్గాం ఉగ్రదాడిలో మానవత్వం మంటగలసి పోయేలా ఒకవైపు ఉగ్రవాదులు హత్యలు చేస్తే.. మరోవైపు కశ్మీరీలు తమ ప్రాణాలు ఫణంగా పెట్టి పర్యాటకులను కాపాడారు. సోషల్ మీడియాలో ఇప్పడు ఆ పహల్గాం సాహస వీరుల గురించి ఆ పర్యాటకులు ఒక్కొక్కరుగా పోస్ట్‌లు చేస్తున్నారు.
అందులో బిజేపీ కార్యకర్త అరవింద్ అగర్వాల్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. తన ప్రాణాలు కాపాడిన సాహస వీరుడికి అరవింద్ అగర్వాల్ ధన్యావాదాలు చేస్తూ భావోద్వేగంగా పోస్ట్ చేశారు. కశ్మీర్ లో లోకల్ గైడ్ గా పర్యాటకులకు సేవలందిస్తున్న నజాకత్ అహ్మద్ షా తన ప్రాణాలు, తన కుటుంబ ప్రాణాలు కాపాడారని ఆయన చేసిన మేలు తాను మరిచిపోలేనని అరవింద్ అగర్వాల్ తెలిపారు.
“ఆ ప్రమాద సమయంలో మీరు మీ ప్రాణాలను లెక్క చేయకుండా మమ్మల్ని కాపాడారు. నజాకత్ భాయ్ మీరు చేసిన ఉపకారం మేము ఎన్నటికీ తీర్చుకోలేం.” అంటూ అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్ లో రెండు ఫొటోలు కూడా షేర్ చేశాడు. ఆ ఫొటోలలో ఒకదానిలో కశ్మీరీ గైడ్ నజాకత్ తో కలిసి అగర్వాల్ కనిపిస్తున్నారు.
అందులో అగర్వాల్ పహల్గాం దాడిలో ఏం జరిగిందో వివరిస్తూ.. “అంతా ప్రశాంతంగా ఉండేది. నేను అక్కడ ఫొటోలు క్లిక్ చేస్తూ ఉన్నాను. కొంచెం దూరంలో నా భార్య, నాలుగేళ్ల నా కూతురు నిలబడి ఉన్నారు. అప్పుడే ఉగ్రవాదులు కాల్పులు చేయడం ప్రారంభించారు. మమ్మల్ని తీసుకొచ్చిన లోకల్ కశ్మీర్ గైడ్ నజాకత్ (28) కాస్త దూరంలో ఇతర పర్యాటకులతో మాట్లాడుతున్నాడు. కాల్పుల శబ్దాలు విని అందరినీ నేలపై పడుకోమని చెప్పాడు. నా కూతురు పరుగుల తీస్తుంటే పాపను, ఇంకో చిన్నపిల్లాడిని ఆయనే పట్టుకొని తీసుకొచ్చాడు.
Also Read: రైలు నుంచి విసిరిన వాటర్ బాటిల్ తగిలి బాలుడు మృతి.. లోకో పైలట్‌పై కేసు
వారిని కింద పడుకోబెట్టి వారికి అడ్డుగా తాను ఉన్నాడు. ఆ తరువాత మెల్లగా వారిని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లి వదిలిపెట్టాడు. ఆ తరువాత మళ్లీ నా భార్యను వారి వద్దకు తీసుకెళ్లాడు. నేను ఆ సమయంలో నా భార్య, కూతురికి ఏ హాని జరగకూడదని ప్రార్థిస్తూ కూర్చున్నాను. పరుగులు తీసే క్రమంలో నా భార్య కిందపడి ఆమె బట్టలు చిరిగిపోయాయి. కానీ స్థానికులు ఆమెకు తమ బట్టలు ఇచ్చారు. ఉగ్రవాదులు కేవలం కొన్ని మీటర్ల దూరంలో కాల్పులు చేస్తూ ఉన్నారు. అప్పుడే నజాకత్ భాయ్ తిరిగి వచ్చి నన్ను మిగతా పర్యాటకులను పక్కనే విరిగి ఉన్న ఫెన్సింగ్ ద్వారా తప్పించి దూరంగా తీసుకొచ్చారు. ఆ తరువాత నన్ను, మిగతా పర్యాటకులను ఒక వాహనంలో కూర్చోబెట్టి సురక్షితంగా రాజధాని శ్రీ నగర్ నగరానికి చేర్చాడు. ఉగ్రవాదుల దాడిలో నజాకత్ భాయ్ సోదరుడు ఆదిల్ పోనీవాలా చనిపోయారని తెలిసి చాలా బాధపడ్డాను.” అని రాశారు.
ఉగ్రవాదులు చేసిన దాడిలో పర్యాటకుల ప్రాణాలను కాపాడడానికి పోరాడుతూ టూరిస్టులకు గుర్రపు స్వారీ చేయించే ఆదిల్ పోనీ వాలా చనిపోయాడు. ఆయన నజాకత్ కు స్వయనా మేనమామ కొడుకు అని అగర్వాల్ చెప్పాడు.