Papaya Benefits: బొప్పాయి పండు గొప్ప రుచిగా ఉంటుంది. బొప్పాయిని ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. దీనిని తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. రకరకాల పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడం, వ్యాధులను నిరోధించడంతో పాటూ యవ్వనంగా కనిపించేందుకు బొప్పాయి ఉపకరిస్తుంది. బొప్పాయిని తినడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. దీనిని అన్ని వయసుల వారూ తినదగిన పండు..
నెల రోజుల పాటు బొప్పాయిని తింటే..
బొప్పాయిని రోజు ఉదయం పూట తింటే అనేక ప్రయోజనాలు చేకూరతాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. బొప్పాయి పండు ఆహారంలోని ప్రొటీన్లను జీర్ణం చేయడంలో సహకరిస్తుంది. కాబట్టి, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ ఉన్న వారికి ఈ పండు అమృతంతో సమానం. బొప్పాయిలో ఉండే నీరు, పపాయన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియ మొదలవ్వడానికి సహాయపడతాయి. ఈ ఎంజైమ్ శరీరం వ్యర్థాలను తొలగించడానికి తోడ్పడుతుంది. కాబట్టి బొప్పాయి తినడం మీ జీర్ణక్రియను మొదలుపెట్టడానికి సహాయపడుతుంది.
డయాబెటిస్‌కు చెక్
మీకు ఎప్పుడైన కలతగా, అసౌకర్యంగా లేదా అనారోగ్యంగా అనిపించినట్లయితే బొప్పాయితో ప్రయోజనం ఉంటుంది. బొప్పాయిలో ఉండే పపాయన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లను విడగొట్టి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇతర ఆహారాలు తీసుకోకముందే మీ జీర్ణకోశాన్ని సిద్ధం చేస్తుంది. అలాగే బొప్పాయిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది, అసిడిటీని కూడా తగ్గిస్తుంది. బొప్పాయిలో ఫోలేట్, పొటాషియం, ఫైబర్ లాంటి పోషకాలు ఉంటాయి. ఇవి రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్లు వాపు తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కాలేయ పనితీరు మెరుగుపరచడంలో సహాయపడతాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు కొల్లజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి.. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. బొప్పాయిలోని విటమిన్ సి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. బొప్పాయి తియ్యగా ఉన్నప్పటికీ, దీనిలోని గ్లైసెమిక్ సూచికను ఎక్కువగా పెంచదు. అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ఎక్కువగా పెంచదు. అంతేకాకుండా ఇది కడుపునిండిన భావనను తొందరగా కలిగిస్తుంది. దీంతో ఆకలిని నియంత్రిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
చర్మ ఆరోగ్యం
దీనిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మచ్చలు, ముడతలు మరియు ఇతర చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. దీనిలోని పోషకాలు గుండె జబ్బుల, క్యాన్సర్ వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీనిని గర్భిణీగా ఉన్న స్త్రీలు తినకూడదు. తింటే గర్భస్రావం జరుగుతుంది.
Also Read: షుగర్ పేషెంట్లు.. ఈ ఫ్రూట్స్ తప్పకుండా తినాలి, ఎందుకంటే ?
బొప్పాయి ఆకులతో కూడా అనేక ప్రయోజనాలు
బొప్పాయి పండు మాత్రమే కాదు.. ఆకులతో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలో రక్త కణాలు పడిపోయినప్పుడు బొప్పాయి ఆకులను జ్యూస్ చేసుకొని తాగడం వల్ల రక్తకణాలు పెరుగుతాయని అనేక వైద్య నిపుణులు తెలిపారు. అంతే కాకుండా పచ్చి బొప్పాయితో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.