BigTV English

Pakistan : అభినందన్ పీక కోస్తాం.. రెచ్చిపోయిన పాక్ ఆర్మీ ఆఫీసర్..

Pakistan : అభినందన్ పీక కోస్తాం.. రెచ్చిపోయిన పాక్ ఆర్మీ ఆఫీసర్..

Pakistan : ఉగ్రవాదులను లేపేయాలి.. పాకిస్తాన్‌కు దిమ్మతిరిగేలా షాక్ ఇవ్వాలి.. వీసాలు, విమానాలు బంద్ చేయడం కాదు.. మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేయాలి.. సింధూ జలాలు రద్దు మాత్రమే కాదు.. పీవోకేపై అటాక్ చేసి తిరిగి స్వాధీనం చేసుకోవాలి.. ఇలా భారతీయుల రక్తం మరుగిపోతోంది. కశ్మీర్, పహల్గాం ఉగ్ర దాడుల తర్వాత రివేంజ్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. భూమి అంచుల వరకూ వెంటాడుతాం.. ట్రాక్ చేసి.. ఊహకు అందని రీతిలో శిక్షిస్తాం.. అని ప్రధాని మోదీ సైతం మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ మన దేశాన్ని మరింత రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోంది. లండన్‌లో ఓ ఆర్మీ ఆఫీసర్ ఓవరాక్షన్‌తో మరింత హైటెన్షన్ క్రియేట్ అయింది.


పాక్ కల్నల్ ఓవరాక్షన్

పాక్‌ ఆర్మీ ఆఫీసర్‌ రెచ్చిపోయాడు. యూకేలోని పాక్‌ ఎంబసీ ముందు ఆందోళనకు దిగిన భారతీయులను రెచ్చగొట్టాడు. వింగ్ కమాండర్‌ అభినందన్‌ ఫొటోనూ చూపిస్తూ.. గొంతు కోస్తామంటూ సంకేతాలు ఇచ్చాడు. ఆ వీడియోపై యావత్ భారతదేశం రగిలిపోతోంది.


భారతీయుల పీకలు కోస్తాం..

పాక్ ఆర్మీకి చెందిన కల్నల్ తైమూర్‌ రహత్.. లండన్‌లోని పాక్‌ ఎంబసీ కార్యాలయంలో ఎయిర్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నాడు. పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ.. ఎంబసీ ముందు భారతీయులు శాంతియుతంగా నిరసన చేపట్టారు. పాక్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో రెచ్చిపోయిన పాక్‌ ఆర్మీ ఆఫీసర్‌.. బలుపు చూపించాడు. భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్థమాన్ పోస్టర్ ఒకచేత్తో పట్టుకుని.. మరో చేతిని భారతీయుల వైపు చూపిస్తూ.. మీ గొంతులు కోస్తాం అన్నట్టు సైగలు చేశాడు పాక్ కల్నల్ తైమూర్ రహత్.

Also Read : రంగంలోకి అజీత్ దోవల్.. ఇక టెర్రరిస్టులకు నరకమే..

పాక్ బలుపు తగ్గలే..

పహల్గామ్ దాడికి నిరసనగా సుమారు 500 మందికి పైగా భారతీయులు.. లండన్‌లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ప్లకార్డులు, భారత జెండాలు, బ్యానర్లు పట్టుకుని.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇస్తున్న పాకిస్తాన్‌పై మండిపడుతూ విమర్శలు చేశారు. అదే సమయంలో పాక్ ఎంబసీ లోపల నుంచి.. సెలబ్రేషన్ తరహాలో పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ ప్లే చేసి ఇండియన్స్‌ను మరింత కవ్వించారు. అనంతరం, ఎంబసీ బాల్కానీలో నిలుచుని పాక్ కల్నల్ తైమూర్.. అలా అభినందన్ వర్థమాన్ ఫోటోను, భారతీయులను చూపిస్తూ.. పీక కోస్తాం అనేలా సైగ చేసి తన మదాన్ని ప్రదర్శించాడు.

Also Read : పాకిస్తాన్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ ఎలా చేసిందంటే.. కంప్లీట్ డీటైల్స్

బాలాకోట్ హీరో అభినందన్ వర్థమాన్

2019లో జరిగిన బాలాకోట్ వైమానిక దాడి హీరోనే మన ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్థమాన్. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన పాకిస్తాన్ యుద్ధవిమానాలను వెంబడిస్తూ.. వాటిని బెదరగొట్టాడు. అదే క్రమంలో నియంత్రణ రేఖ దాటి వెళ్లి మరీ.. పీవోకేలోని బాలాకోట్ సమీపంలో బాంబులు వేశాడు. ఫిబ్రవరి 27న జరిగిన దాడిలో అభినందన్ ఫైటర్ జెట్ పాక్ భూభాగంలో కూలిపోయింది. అతన్ని బంధీగా పట్టుకుంది పాకిస్తాన్ ఆర్మీ. వెంటనే రంగంలోకి దిగిన భారత ప్రభుత్వం.. పాక్‌పై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. అభినందన్‌ను విడిచిపెట్టకపోతే.. అవసరమైతే పాక్‌పై యుద్ధానికైనా సిద్ధం అంటూ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. దెబ్బకు దడుసుకున్న దాయాది దేశం.. మార్చి 1న అభినందన్ వర్థమాన్‌ను సురక్షితంగా విడిచిపెట్టింది. ఇప్పుడు అదే అభినందన్ ఫోటోను చూపిస్తూ.. లండన్‌లోని పాకిస్తాన్ ఎంబసీ అధికారులు పీక కోస్తాం అంటూ శాడిజం చూపించారు.

Also Read : పీవోకే స్వాధీనం సాధ్యమేనా? 

Also Read : ఇండియా vs పాకిస్తాన్.. ఎవరి ఆర్మీ పవర్‌ఫుల్?

Also Read : ఉగ్రదాడి.. ఏపీ, తెలంగాణలోని 14 ప్రాంతాల్లో హైఅలర్ట్

Also Read : కల్మా అంటే ఏంటి? టెర్రరిస్టులు వాళ్లను ఎందుకు వదిలేశారంటే..

Also Read : ఉగ్రవాదులు కాదు ఫ్రీడమ్ ఫైటర్స్.. పాకిస్తాన్ బరితెగింపు..

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×