Blackout In Jammu: పాక్ డ్రోన్ల ఉదంతానికి మన సైనికులు బుద్ధి చెప్పినా పాక్ మాత్రం కుక్క బుద్ధి మానుకోలేదు. జమ్మూలో శుక్రవారం సాయంత్రం కాస్త ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు ఊతమిచ్చేలా జమ్మూ నగరంలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, నగరమంతా చీకట్లో కూరుకుపోయిన దృశ్యాన్ని సీఎం ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్‌లో పంచుకోవడం విశేషం.
ఒమర్ అబ్దుల్లా ట్వీట్ ప్రకారం..
కాశ్మీర్ నగరమంతా బ్లాక్ అవుట్ అయ్యిందని, సైరన్లు గంభీరంగా వినిపిస్తున్నాయని ఒమర్ ట్వీట్ చేశారు. ఎడతెరిపిలేని పేలుళ్ల శబ్దాలు కూడా వినిపిస్తున్నాయని, ఇవి బహుశా హెవీ ఆర్టిలరీ గన్ ధ్వనులు కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే భద్రతా విభాగాలు జారీ చేసిన సూచనల మేరకు ఎవ్వరూ బయటకు రావద్దని ఆయన సూచించారు.
అపోహలకు లోనుకాకుండా అధికారిక సమాచారం కోసం వేచి ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జమ్మూలో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా, ఆయన మరో విజ్ఞప్తి చేశారు. సైనికులు, భద్రతా విభాగాలు తమ విధులను నిర్విరామంగా నిర్వర్తిస్తుండగా, పౌరులు శాంతియుతంగా, జాగ్రత్తగా ఉండడం అత్యవసరమని ఒమర్ అభిప్రాయపడ్డారు.
పాక్ కు గట్టి బుద్ధి చెప్పిన సైనిక్స్
సాంబా సెక్టార్, పఠాన్ కోట్, పోఖ్రాన్ సహా సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి పాకిస్తాన్ డ్రోన్ లు తిరగబడ్డాయి. పాక్ డ్రోన్లను భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థంగా గుర్తించి వెంటనే తుపాకుల మోత మోగించింది. జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. మన సైన్యం దెబ్బకు పాక్ తోకముడిచిందని తెలుస్తోంది. ముందస్తుగా మన సైన్యాన్ని కేంద్రం అప్రమత్తం చేయడంతో పాక్ డ్రోన్స్ ఆటలు సాగలేదని తెలుస్తోంది.
భద్రతా దళాలు హై అలర్ట్‌లో..
సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పఠాన్ కోట్ ప్రాంతంలో సైనిక బలగాలు భారీగా మోహరించాయి. జమ్ముకశ్మీర్‌లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో భారత భద్రతా దళాలు పూర్తి హై అలర్ట్‌లో ఉన్నాయి. వాయుసేన, ఆర్మీ మిస్సైల్ యూనిట్లు అప్రమత్తంగా చర్యలు చేపట్టినట్లు సమాచారం.
Blackout in Jammu now. Sirens can be heard across the city. pic.twitter.com/TE0X2LYzQ8
— Omar Abdullah (@OmarAbdullah) May 9, 2025