BigTV English

Nainika: నా వల్లే అమ్మకు ఆ పరిస్థితి..నైనిక కన్నీళ్లతో..

Nainika: నా వల్లే అమ్మకు ఆ పరిస్థితి..నైనిక కన్నీళ్లతో..

Nainika: అమ్మ పేరులోనే ప్రేమని మాధుర్యాన్ని నింపుకొని అమృతమూర్తి అమ్మ. అమ్మ ప్రేమ ఎంతో తీయనైనది కనుక ఆ భగవంతుడు కూడ ఆయన కన్నా అమ్మే గొప్పదని చాటి చెప్పాడు. దేవుడు కూడ రాముడిగా, కృష్ణుడిగా, అమ్మ కడుపుని పుట్టారు. అమ్మని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. తన ప్రేమ త్యాగం ఎవ్వరితో పోల్చడానికి సరిపోవు.ఎవ్వరి ప్రేమ ఐనా అమ్మ ప్రేమ ముందు తక్కువే అవుతుంది. బ్రహ్మ సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం ఇంకేమీ లేదు. అలాంటి అమ్మలకు ఒకరోజు అంకితం చేసుకుంటూ మదర్స్ డే ని జరుపుకుంటాం. ఆరోజు ఎన్నో ప్రోగ్రామ్స్ ప్రతి ఛానల్ లో టెలికాస్ట్ అవుతాయి. తాజాగా మాటీవీలో మదర్ డే సందర్భంగా, లవ్ యు అమ్మ ప్రోగ్రామ్ ను తల్లులకు అంకితం చేస్తూ, నిర్వహిస్తారు. ఈ ప్రోగ్రాం లో సీరియల్స్ సెలబ్రిటీలు వారి తల్లులతో వచ్చి ప్రోగ్రాం నిర్వహించడం విశేషం. తాజాగా మాటీవీలో మే 11న మదర్స్ డే సందర్భంగా ‘లవ్ యు అమ్మ’ కార్యక్రమం ప్రోమో రిలీజ్ చేశారు. అందులో భాగంగా బిగ్ బాస్ నైనికా తన తల్లి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.


.నైనిక కన్నీళ్లతో..

అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని మే 11న ఆదివారం రానుంది. ఆ సందర్భంగా మాటీవీలో లవ్ యు అమ్మ ప్రోగ్రామ్ ను ఆదివారం సాయంత్రం టెలికాస్ట్ కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.యాంకర్ గా ఈ ప్రోగ్రాంకు రవి వ్యవహరించారు. ప్రోమోలో నైనిక తన డాన్స్ జర్నీలో తను పడిన బాధలకు తన తల్లి సపోర్టుగా నిలవడం గురించి ఎమోషనల్ అవుతుంది. ఎంతోమంది తనను అవమానించారని, నేను పుట్టినప్పటినుంచి ఎంతో బాధపడ్డాను, నావల్ల మా మమ్మీ లైఫ్ ని ఎంజాయ్ చేయలేక పోయింది. అంటూ ఎమోషనల్ అయింది. నైనిక తల్లి కూడా ఈ షోలో ఎమోషనల్ అవ్వడం మనం చూడొచ్చు. నైనిక డాన్స్ ప్రోగ్రాం ఢీ తో పాపులర్ అయ్యారు. బిగ్బాస్ సీజన్ 8 లోను కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఈ షోలో ఆమె ఎమోషనల్ అవ్వడం చూసి అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.


డాన్స్ తో పాపులర్..

ఇక నైనిక జీ తెలుగులో ప్రసారమైన డాన్స్ ఇండియా డాన్స్ సీజన్ సిక్స్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ గా వచ్చి అద్భుతమైన డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ షో ఆమెకు జాతి స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఈటీవీలో ఢీ 10 కింగ్స్ వర్సెస్ స్క్రీన్స్, ఢీ 14 డాన్స్ ఐకాన్ లో పాల్గొంది. ఢీ 13లో ఆమె ఫైనల్ కు చేరుకుంది. ఈమె ఇతర టీవీ ప్రోగ్రామ్స్ లో కూడా డాన్స్ షోలలో, పాల్గొంటూ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు. ఈమె డాన్స్ తోనే కాక 2023లో పిల్ల పడేసావే అనే సీరియల్ లో అను పాత్రలో నటించారు 2024లో నయనం అనే తెలుగు వెబ్ సిరీస్ లోను నటి మెప్పించారు. బిగ్బాస్ సీజన్ 8 లో 13వ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు ఐదో వారం వరకు ఉండి తర్వాత ఎలిమినేట్ అయ్యారు. ఈమె సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. అభిమానులతో ఆమె తన వ్యక్తిగత విషయాలను డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ పాపులర్ అయ్యారు.

?igsh=ZjFkYzMzMDQzZg==

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×