BigTV English

Boeing 737 MAX : బోయింగ్‌ కలకలం.. ఓ విమానంలో లోపాన్ని గుర్తించిన డీజీసీఏ..

Boeing 737 MAX : భారత్‌లో కూడా బోయింగ్‌ 737 మ్యాక్స్ విమానంలో ఓ లోపం బయటపడినట్లు డీజీసీఏ ప్రకటించింది. బోయింగ్‌ 737 మ్యాక్స్‌ రకం విమానాలు వైమానిక రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇటీవల వీటిల్లో పలు లోపాలు బయటపడ్డాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్‌లైన్స్‌లలో ప్రభుత్వాలు తనిఖీలు చేపట్టాయి. తాజాగా భారత్‌లోనూ వైమానిక రంగ నియంత్రణ సంస్థ (డీజీసీఏ) దీనిపై దృష్టి సారించింది. దేశంలో ఈ రకం విమానాలు మొత్తం 40 ఉన్నాయి. వీటిలో ఆకాశ ఎయిర్‌ (22), ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ (9) స్పైస్‌ జెట్‌ (9)లను నడుపుతున్నాయి.

Boeing 737 MAX : బోయింగ్‌ కలకలం.. ఓ విమానంలో లోపాన్ని గుర్తించిన డీజీసీఏ..
Boeing 737 MAX

Boeing 737 MAX(Today news paper telugu):

భారత్‌లో కూడా బోయింగ్‌ 737 మ్యాక్స్ విమానంలో ఓ లోపం బయటపడినట్లు డీజీసీఏ ప్రకటించింది. బోయింగ్‌ 737 మ్యాక్స్‌ రకం విమానాలు వైమానిక రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇటీవల వీటిల్లో పలు లోపాలు బయటపడ్డాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్‌లైన్స్‌లలో ప్రభుత్వాలు తనిఖీలు చేపట్టాయి. తాజాగా భారత్‌లోనూ వైమానిక రంగ నియంత్రణ సంస్థ (డీజీసీఏ) దీనిపై దృష్టి సారించింది. దేశంలో ఈ రకం విమానాలు మొత్తం 40 ఉన్నాయి. వీటిలో ఆకాశ ఎయిర్‌ (22), ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ (9) స్పైస్‌ జెట్‌ (9)లను నడుపుతున్నాయి.


తాజాగా ఈ విమానాల్లో డీజీసీఏ తనిఖీలు చేపట్టింది. ఒక విమానంలో వాషర్‌ లేనట్లుగా గుర్తించినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు 39 విమానాల్లో తనిఖీలు పూర్తయ్యాయని తెలిపింది. 40వ దానిలో వాషర్‌ కనిపించలేదని డీజీసీఏ తెలిపింది. ఈ విషయం బోయింగ్‌ దృష్టికి తీసుకెళ్లామని తెలియజేశారు. ఆ సంస్థ సూచించిన విధంగా చర్యలు తీసుకుంటామని డీజీసీఏ వెల్లడించింది.

అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 మ్యాక్స్‌ 9 రకం విమానం 177 మంది ప్రయాణికులతో గాల్లో ఉండగా.. డోర్‌ప్లగ్‌ ఊడిపోయింది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత నెల చివర్లో ఓ 737 మ్యాక్స్‌ విమానం రడ్డర్‌ కంట్రోల్‌ వ్యవస్థలో కీలకమైన బోల్ట్‌కు నట్లు లేనట్లుగా అధికారులు గుర్తించారు.


ఐదేళ్ల క్రితం నెలల వ్యవధిలోనే ఇధియోపియాల, ఇండోనేషియాలో రెండు బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలు కూలి 346 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 20 నెలల పాటు ఈ రకం విమానాలను ఉపయోగించలేదు. ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన కార్పొరేట్‌ విషాదంగా ఈ ఘటన నిలిచింది. అనంతరం బోయింగ్‌కు దాదాపు 20 బిలియన్‌ డాలర్ల మేర నష్టం వచ్చింది. ఆ తర్వాత కూడా పలు లోపాలు ఈ విమానాన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి.

Tags

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×