BigTV English

Marriage: చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన వధువు.. అక్కడే పెళ్లి చేసుకున్న వరుడు

Marriage: చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన వధువు.. అక్కడే పెళ్లి చేసుకున్న వరుడు

Marriage: మరికొద్ది గంటల్లో ఆ జంట వివాహబంధంలోకి అడుగుపెట్టబోతోంది. ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలయింది. ఘనంగా ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సందడి నెలకొంది. పెళ్లి బాజాలు మోగుతున్నాయి. అంతా సంతోషంగా జరుగోంది అనుకునే సమయంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కూతురు ఒక్కసారిగా మెట్లపై నుంచి జారి పడింది. దీంతో ఆమె రెండు చేతులు విరిగిపోయాయి. ఈ ఘటన రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో చోటుచేసుకుంది.


రామ్‌గంజ్ ప్రాంతానికి చెందిన పంకజ్‌కు రావత్‌భటాకు చెందిన మధు రాథోడ్‌కు పెద్దలు పెళ్లి చేయాలని నిర్ణయించారు. శనివారం పెళ్లి జరగాల్సి ఉంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంతలోనే మధు మెట్లపై నుంచి కాలుజారి పడింది. దీంతో ఆమె రెండు చేతులు విరిగిపోయాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది.

అయితే పెళ్లిని వాయిదా వేసుకోవడం ఇష్టం లేక రావత్‌భటా ఆసుపత్రిలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఆసుపత్రిలో రూమ్ బుక్ చేశారు. దానిని అందంగా అలంకరించారు. రావత్‌భట్ ఇంటి దగ్గరి నుంచి ఊరేగుతూ ఆసుపత్రికి చేరుకున్నాడు. ఆసుపత్రిలోనే పెద్దలు, కటుంబ సభ్యుల సమక్షంలో మధు మెడలో రావత్ మూడు ముళ్లు వేశాడు. వివాహబంధంతో వారు ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఆసుపత్రి సిబ్బంది సమక్షంలో వారి వివాహం జరిగింది. ప్రస్తుతం వారి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×