BigTV English

Budget 2023: బడ్జెట్ లో టాప్ 7 ప్రయారిటీస్.. సప్త రుషులను కోట్ చేసిన మంత్రి నిర్మల..

Budget 2023: బడ్జెట్ లో టాప్ 7 ప్రయారిటీస్.. సప్త రుషులను కోట్ చేసిన మంత్రి నిర్మల..

Budget 2023: ప్రతీ ఏడాది బడ్జెట్ కో ప్రత్యేకత ఉంటుంది. ఈసారి ఏకంగా 7 అంశాలకు బడ్జెట్ లో ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర ప్రభుత్వ టాప్ 7 ప్రయారిటీస్ ఇవే…


  1. సమ్మిళత వృద్ధి
  2. చిట్టచివరి వ్యక్తికి కూడా లబ్ది చేకూర్చడం
  3. మౌళిక సదుపాయాలు, పెట్టుబడులు
  4. సామర్థ్యాలను వెలికితీయడం
  5. హరిత వృద్ధి
  6. యువశక్తి
  7. ఆర్థిక రంగం బలోపేతం

ఇలా ఏడు కీలక రంగాలను గుర్తించి.. వాటి అభివృద్ధికి లక్ష్యాలు నిర్దేశించుకుంది కేంద్రం. మరోవైపు వ్యవసాయ రంగంలోనూ ఏడు కీలక అంశాలు గుర్తించింది.

  1. వ్యవసాయం కోసం డిజిటల్‌ మౌలిక సదుపాయాలు.
  2. వ్యవసాయ రంగానికి రుణ సదుపాయం, మార్కెటింగ్‌ సదుపాయం.
  3. వ్యవసాయ స్టార్టప్స్‌కు చేయూత, ప్రత్యేక నిధి ఏర్పాటు.
  4. రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు.
  5. పత్తిసాగు మెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు. పత్తి కోసం ప్రత్యేకంగా మార్కెటింగ్‌ సదుపాయం.
  6. ఆత్మ నిర్భర్‌ భారత్‌ క్లీన్‌ పథకం ఉద్యానవన పంటకు చేయూత.
  7. చిరుధాన్యాల పంటలకు సహకారం కోసం ‘శ్రీఅన్న’ పథకం. రాగులు, జొన్నలు, సజ్జలు తదితర చిరుధాన్యాల పంటలకు ప్రత్యేక ప్రోత్సాహం.

ఇలా వ్యవసాయ రంగానికి టాప్ ప్రయారిటీ ఇస్తూ బడ్జెట్ లో ఏడు అంశాలు ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. రైతులు కేంద్ర ప్రభుత్వంపై కాస్త ఆగ్రహంగా ఉండటం.. దేశ రాజధానిలో ధర్నాలు, ఆందోళనలు చేయడం, మూడు వ్యవసాయ చట్టాలు చేసిన డ్యామేజ్, కొత్త దేశంలోని పలు పార్టీలు రైతుల కేంద్రంగా రాజకీయం చేసేందుకు సిద్ధం అవుతుండటంతో.. ఈసారి బడ్జెట్ లో వ్యవసాయ రంగంపై ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం అని అంటున్నారు.


Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×