Big Stories

Rooftop Solar : కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తు..!

Rooftop solarisation scheme (daily news update) :

- Advertisement -

కోటి ఇళ్లకు ప్రతినెలా 300 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాత్కాలిక బడ్జెట్‌లో ప్రకటించారు. అయితే నేరుగా కాకుండా రూఫ్‌ టాప్‌ సోలార్‌ పాలసీ కింద ఉచిత విద్యుత్తును అందజేయనున్నారు. ఇందులో భాగంగా కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ (RTS) వ్యవస్థలను నెలకొల్పుతారు. ఈ క్రమంలోనే ప్రతి ఇంటికి 300 యూనిట్ల సౌర విద్యుత్ ఉచితంగా అందిస్తామని నిర్మల పేర్కొన్నారు.

- Advertisement -

అంతేకాదు.. వినియోగం పోగా మిగిలిన విద్యుత్తును పంపిణీ సంస్థలకు విక్రయించు‌కోవచ్చు. దీంతో ప్రతి కుటుంబానికి ఏటా రూ.15-18 వేలు ఆదా అవుతుందని నిర్మల పేర్కొన్నారు. రూఫ్ టాప్ సోలరైజేషన్‌ని వేగంగా అమలు చేసే లక్ష్యంతో.. ఆ పథకానికి ఉచిత విద్యుత్తును జోడించారు. దీని వల్ల పేద, మధ్య తరగతి ప్రజలకు విద్యుత్తు బిల్లుల భారం తగ్గుతుంది. పైపెచ్చు.. ఇంధన రంగంలో స్వావలంబన దిశగా దేశం అడుగులు వేసే అవకాశమూ లభిస్తుంది.

ఆర్టీఎస్ ఫేజ్-2ను కేంద్రం 8 మార్చి 2019న ప్రారంభించింది. 40 గిగా వాట్ల రూఫ్ టాప్ సోలార్ పవర్ ఉత్పత్తే లక్ష్యంగా ఆ పథకాన్ని ఆరంభించారు. కేంద్ర ఆర్థిక సాయం(CFA) ద్వారా గృహరంగంలో 4 గిగావాట్ల సౌర విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వం సంకల్పించింది. జనరల్ కేటగిరీ కిందకు వచ్చే రాష్ట్రాల్లో కిలోవాట్‌కు రూ.14,588 చొప్పున తొలి 3 కిలోవాట్ల ఇన్‌స్టలేషన్ ఖర్చు కేంద్రమే భరిస్తుంది. 3 నుంచి 10 కిలోవాట్లు అయితే రూ.7,294 చొప్పున సాయం చేస్తుంది.

స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలు అయితే(సిక్కిం సహా ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, లద్దాఖ్, లక్షద్వీప్, అండమాన్-నికోబార్ దీవులు) తొలి 3 కిలోవాట్లకు రూ.17,662 చొప్పున సీఎఫ్ఏ అందుతుంది. 3 నుంచి 10 కిలోవాట్లలోపు అయితే.. కిలోవాట్‌కు రూ.8,831 చొప్పున సాయం అందుతుంది. అపార్ట్‌మెంట్లు, గ్రూప్ హౌసింగ్ సొసైటీలు కూడా తమ ఉమ్మడి అవసరాల కోసం రూప్ టాఫ్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు.

అయితే గరిష్ఠంగా 500 కిలోవాట్ల సామర్థ్యం వరకు మాత్రమే సీఎఫ్‌ఏ అందుతుంది. జనరల్ కేటగిరీ రాష్ట్రాల్లో కిలోవాట్ రూ.7,294, స్పెషల్ కేటగిరీ రాష్ట్రాల్లో రూ.8,831 చొప్పున కేంద్రం సబ్సిడీ పొందొచ్చు. ఈ పథకానికి 2026 మార్చి 31 వరకు గడువు ఉంది. కేంద్ర ఆర్థిక సాయం(CFA) ద్వారా గృహరంగంలో 4 గిగావాట్ల సౌర విద్యుదుత్పత్తి సాధించాలన్న లక్ష్యంలో ఇప్పటివరకు సాధించింది 2.65 గిగావాట్లు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News