BigTV English

Budget Briefcase : బడ్జెట్ బాక్స్ ఎర్ర రంగులోనే ఎందుకుంటుంది?

Budget Briefcase : బడ్జెట్ బాక్స్ ఎర్ర రంగులోనే ఎందుకుంటుంది?
Budget Briefcase

Budget Briefcase : 2024 సంవత్సరానికి సంబంధించిన మధ్యంతర బడ్జెట్ ఫిబ్రవరి 1న రానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే గతంలో మన బడ్జెట్ పత్రాలను ఆర్థికమంత్రి ఎర్రని బ్యాగ్‌లో తెచ్చేవారు. తర్వాత రోజుల్లో అది ఎర్రటి బ్రీఫ్‌కేసుగా మారగా, ప్రస్తుతం డిజిటల్ ఇండియా కాన్సెప్ట్‌కు తగినట్లు గత మూడేళ్లుగా ఎర్రని వస్త్రం చుట్టిన ట్యాబ్‌లో తీసుకొస్తున్నారు. ఇంతకూ బడ్జెట్‌కు ఎర్రరంగుకూ ఏమిటి సంబంధం? అంటే..


1860లో బడ్జెట్ బ్రీఫ్‌కేస్‌ను మొదటిసారిగా ఎరుపు రంగును ఉపయోగించారు. నాడు బ్రిటీష్ ఛాన్స్‌లర్ గ్లాడ్‌స్టన్ బడ్జెట్ పత్రాలను ఎర్రని తోలున్న చెక్కపెట్టెలో బడ్జెట్ పత్రాలను తీసికొచ్చారు. బ్రిటిష్ రాణి మోనోగ్రామ్ చెక్కిన ఆ లెదర్ బ్యాగ్‌ని తర్వాతి రోజుల్లో అందరూ గ్లాడ్‌స్టన్ బాక్స్ అనటం మొదలుపెట్టారు. అప్పట్లో ఆ ఎరుపురంగు పెట్టె పెట్టె ప్రజల దృష్టిని ఆకర్షించింది. దీంతో జనం కూడా ఎర్రటి పెట్టెలు, ఎర్రని బ్రీఫ్‌కేస్‌లు వాడటం మొదలుపెట్టారు.

దూరం నుంచే ప్రజల దృష్టిని ఆకర్షిస్తుందనే కారణంతోనే గ్లాడ్‌స్టన్ ఎరుపు రంగును వాడారని చెబుతారు. పైగా.. ఎరుపు రంగు వాడటం వల్ల ఇందులో చాలా ముఖ్యమైన పత్రాలున్నాయని సూచిస్తుందని కూడా ఆయన భావించారు.


ఇక.. బ్రిటిషర్ల నుంచి స్వాతంత్ర్యం పొందాక కూడా ఇదే సంప్రదాయం కొనసాగింది. 1947లో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి షణ్ముఖం శెట్టి 26 నవంబర్ 1947న ఎర్రని లెదర్ బ్రీఫ్‌కేస్‌ను వాడారు. కానీ.. 1958లో స్వయంగా ప్రధాని నెహ్రయే బడ్టెట్ పెట్టారు గానీ.. ఆయన నల్లని బ్రీఫ్‌కేస్‌లోనే బడ్జెట్‌ పత్రాలను తీసుకొచ్చారు.

ఇక.. 1991లో ఆర్థికమంత్రిగా మన్మోహన్‌సింగ్‌ ఎర్రబ్యాగులో బడ్జెట్‌ పత్రాలు తీసుకురాగా, 1998-99లో నాటి ఆర్థికమంత్రి యశ్వంత్ సింగ్ నల్లటి బకిల్స్, పట్టీలతో కూడిన బ్యాగ్‌లో బడ్జెట్‌ను సమర్పించారు. మోదీ హయాంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలి బడ్జెట్ పత్రాలను ఎరుపు రంగు లెడ్జర్‌లో తీసుకురాగా, 2021 బడ్జెట్‌ను పేపర్‌లెస్‌లో మొదటిసారిగా ఎరుపు రంగు స్లీవ్‌లో టాబ్లెట్‌ని తీసుకువచ్చారు. ఆ టాబ్లెట్ మేడ్ ఇన్ ఇండియా డివైజ్ కావడం విశేషం.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×