BigTV English

Interim Budget 2024 : ఫిబ్రవరి 1 నుంచి మారేవి ఇవే..!

Interim Budget 2024 : ఫిబ్రవరి 1 నుంచి మారేవి ఇవే..!

Interim Budget 2024 : మరో మూడు రోజుల్లో కేంద్రం మరోసారి మధ్యంతర బడ్జెట్‌తో మన ముందుకు రానుంది. ఈ బడ్జెట్‌లో పన్ను మినహాయింపులు, ఆర్థిక సంస్కరణలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అలాగే.. ఈ బడ్జెట్‌ రాకతో ఫిబ్రవరి నుంచి కొన్ని అంశాల్లో మార్పులూ రానున్నాయి. ఆ మార్పులేంటో తెలుసుకుందాం.


NPS విత్ డ్రా రూల్స్ : నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద పెట్టుబడి పెట్టిన నిధులను పాక్షికంగా విత్ డ్రా చేసుకునేందుకు రూల్స్ నిర్దేశిస్తూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) జనవరిలో మాస్టర్ సర్క్యులర్‌ను జారీ చేసింది. మొదటిసారి ఇల్లు కొనేవారు లేదా నిర్మించుకునే వారు మాత్రమే ఈ ఖాతా నుంచి తమ మొత్తాన్ని విత్ డ్రా చేయగలరని సంస్థ స్పష్టం చేసింది. ఈ నిబంధన ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానుంది.

ఫాస్టాగ్ ఈ-కేవైసీ : కేవైసీ లేని అన్ని ఫాస్టాగ్‌లు జనవరి 31 తర్వాత డీయాక్టివేట్ అవుతాయని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఫిబ్రవరి 1 లోపు వినియోగదారులు తమ ఫాస్టాగ్ KYC పూర్తి చేసుకోవాలి. కాగా, దేశ వ్యాప్తంగా దాదాపు 7 కోట్ల ఫాస్ట్‌ట్యాగ్‌లు జారీ కాగా, వీటిలో 4 కోట్లు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. ఇవిగాక 1.2 కోట్ల డూప్లికేట్ ఫాస్టాగ్‌లు ఉన్నట్లు అధికార వర్గాలు భావిస్తున్న నేపథ్యతంలో వీటన్నింటినీ ఐడెంటీఫై చేయడానికే ఈ-కేవైసీ చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది.


సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023-24 ఆర్థిక సంవత్సరంలో సావరిన్ గోల్డ్ బాండ్ చివరి విడతను ఫిబ్రవరిలో విడుదల చేస్తుంది. SGB ​​2023-24 సిరీస్ 4 ఫిబ్రవరి 12న ఓపెన్ అవుతుంది. 16 ఫిబ్రవరి 2024న ముగుస్తుంది. అంతకు ముందు విడత డిసెంబర్ 18న ప్రారంభమై డిసెంబర్ 22న ముగిసింది. ఈ వాయిదా కోసం, సెంట్రల్ బ్యాంక్ బంగారం ధరను గ్రాముకు రూ.6,199గా నిర్ణయించింది.

SBI హోమ్ లోన్స్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం కస్టమర్లకు గృహ రుణాలపై భారీగా రాయితీలను అందిస్తోంది. 65 bps కంటే తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందిస్తోంది. హోమ్ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజు, రాయితీలకు చివరి తేదీ 31 జనవరి 2024 గా ఇప్పటికే ప్రకటించింది. ఈ రాయితీ ఫ్లెక్సిపే, ఎన్ఆర్ఐ, నాన్-లైఫ్, ప్రివిలేజ్, ఇతరులకు అందుబాటులో ఉంది.

ధన్ లక్ష్మి ఎఫ్‌డి స్కీమ్ : ‘ధన్ లక్ష్మి 444 డేస్’ పేరుతో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (PSB) ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని తీసుకువచ్చింది. నిజానికి నవంబర్ 30, 2023 వరకే చివరి తేదీ ఉండగా.. దానిని జనవరి 31, 2024 వరకు పొడిగించింది. ఈ ఎఫ్‌డిలో డబ్బు పెట్టుబడి పెట్టేవారు గడువులోగా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఎఫ్‌డీ కాలవ్యవధి 444 రోజులు. వడ్డీ రేటు 7.4%, సూపర్ సీనియర్లకు ఇది 8.05% చొప్పు వడ్డీ రేటు అందిస్తోంది.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×