Big Stories

ED Summons To Delhi CM Kejriwal: కేజ్రీవాల్‌కు తొమ్మిదోసారి ఈడీ నోటీసులు.. కవితతో కలిపి ప్రశ్నిస్తారా?

ED Summons To Delhi CM Kejriwal

- Advertisement -

ED Issues 9th Summon to CM Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను వెంటాడుతోంది. ఇప్పటికే ఈడీ ఆయనకు 8సార్లు నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్ బెయిల్ వచ్చింది. బెయిల్ మంజూరైన 24 గంటలకు కూడా గడవముందే ఈడీ 9సారి ఆయన నోటీసులు ఇచ్చింది.

- Advertisement -

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మార్చి 21న ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ కేసులో గతంలో 8సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో న్యాయస్థానాన్ని ఈడీ అధికారులు ఆశ్రయించారు. ఢిల్లీ కోర్టులో రెండు పిటిషన్లు వేశారు. దీని విచారణకు మాత్రం శనివారం అరవింద్ కేజ్రీవాల్ న్యాయస్థానానికి వచ్చారు. న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. వాదనలు తర్వాత ఢిల్లీ సీఎంకు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. కానీ ఒక్కోరోజు కూడా గడవకుండానే ఈడీ మరోసారి సమన్లు జారీ చేయడం ఆసక్తిగా మారింది.

మరోవైపు ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. శనివారం కోర్టులో హాజరుపర్చారు. ఆమెకు మార్చి 23 వరకు న్యాయస్థానం ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. మార్చి 21 న కేజ్రీవాల్ విచారణ రావాలని అందుకే ఈడీ కోరుతోంది. కేజ్రీవాల్, కవితను కలిపి ఈడీ ప్రశ్నించాలని భావిస్తోంది.

Also Read: ఆమే కింగ్ పిన్.. ఈడీ కస్టడీ పిటిషన్‌లో సంచలన విషయాలు..

ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేశారు. కవిత సన్నిహతులు అరెస్ట్ అయ్యారు. అలాగే ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఇప్పటికే అరెస్టై జైల్లో ఉన్నారు. కవిత అరెస్ట్ తో ఢిల్లీ మద్యం కేసులో విచారణను ఈడీ మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చింది. మరి ఢిల్లీ సీఎం గతంలో మాదిరిగా విచారణకు డుమ్మా కొడతారా? విచారణకు హాజరువుతారా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News