E-Paper
Advertisement

Rahul Gandhi Bharat Jodo Yatra: ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. నేడు భారీ బహిరంగ సభ!

Rahul Gandhi Bharat Jodo Yatra: ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. నేడు భారీ బహిరంగ సభ!
Advertisement

Rahul GandhiRahul Gandhi Conclude Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన రెండో విడత భారత్ జోడో న్యాయ యాత్ర శనివారంతో ముగిసింది. ఈ ఏడాది జనవరి 14న మణిపూర్‌ నుంచి 6,700 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించిన రెండు నెలల తర్వాత రాహుల్ గాంధీ ఈ యాత్రకు ముంబయిలోని దాదర్ ప్రాంతం వద్ద ముగించారు. అయితే ఈ రోజు విపక్షాల ఇండియా కూటమి ముంబయిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. ఆదివారం మణిభవన్‌ నుంచి ఆగస్టు క్రాంతి మైదాన్‌ వరకు ‘న్యాయ్‌ సంకల్ప్‌ పాదయాత్ర’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సందర్భంగా జరిగే ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ లు హాజరుకానున్నారు.

రాహుల్ గాంధీ చేపట్టిన రెండో విడత భారత్ జోడో న్యాయ్ యాత్ర మణిపుర్‌ నుంచి ముంబయి వరకు 63 రోజులపాటు కొనసాగింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలైనందున రాహుల్ గాంధీ తన యాత్ర ముంబైలోని దాదర్‌ వద్దకు రాగానే ఆపేశారు. రాహుల్ తో పాటుగా ఆ ముంగిపు కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముంబయిలోని బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారకం ‘చైత్యభూమి’ వద్ద రాహుల్, ప్రియాంక, స్థానిక కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. అనంతరం రాహుల్ గాంధీ అక్కడే రాజ్యాంక పీఠిక చదివారు.

Advertisement

Also Read: Jammu Kashmir Aseembly Elections : జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు.. సీఈసీ క్లారిటీ..

యాత్రను విజయవంతంగా నిర్వహించినందుకు ప్రియాంకా గాంధీ.. రాహుల్ కు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత ఆమె ప్రజలు ఉద్దేశించి మాట్లాడారు. ‘కేంద్ర ప్రభుత్వం వైఫ్యలాలు, దానికి సంబంధిన నిజాలను ప్రజలకు చెప్పేందుకే రాహుల్ ఈ యాత్ర చేశారు. ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు ఈ యాత్రను నిర్వహించారు’ అని తెలిపారు. మహారాష్ట్రలో రాహుల్ గాంధీ యాత్రను మార్చి 17న ముగియాల్సి ఉండగా.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఒకరోజు ముందే ముగించాల్సి వచ్చిందని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు.

Related News

ఆసుపత్రి నుంచే సోనమ్ వాంగ్‌చుక్ సంచలన లేఖ.. ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పుతో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×