CBI Raids Ex CM House: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో సీబీఐ బృందాలు రాయ్‌పూర్, భిలాయిలోని భూపేష్ బఘేల్ నివాసానికి వచ్చారు. నోటీసులు ఇచ్చి సోదాలు చేపట్టారు.
మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నివాసమే కాకుండా ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఓ ఉన్నతాధికారి నివాసంపై సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సోదాలు ఏ కేసులో జరుగుతున్నాయో అనేది సీబీఐ అధికారులు ఇంకా వెల్లడించలేదు.
సోదాలపై అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే మహదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారానికి సంబంధించిన కేసులో ఈ తనిఖీలు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు. కొద్దిరోజుల కిందట మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి బఘేల్, ఆయన కుమారుడు నివాసంలో ఈడీ సోదాలు చేసింది. ఆ సోదాల సమయంలో దాదాపు రూ.30 లక్షల నగదు, పలు రకాల పత్రాలను స్వాధీనం చేసుకుంది.
మరోవైపు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వచ్చేనెల 8, 9న జరగనున్న ఏఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకోసం ఏర్పాటు చేసిన డ్రాఫ్టింగ్ కమిటీ బుధవారం సమావేశం కానుంది. ఉదయం 9 గంటకు ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇంతలోనే సీబీఐ రంగంలోకి దిగేసింది. ప్రస్తుతం సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
ALSO READ: బీజేపీ ముస్లిం వ్యతిరేకి కాదు