BigTV English

Modi Gift To Poor Muslims: బిజేపీ ముస్లిం వ్యతిరేకి కాదు.. దేశవ్యాప్తంగా పేద ముస్లింలకు ప్రధాని మోదీ కానుకలు

Modi Gift To Poor Muslims: బిజేపీ ముస్లిం వ్యతిరేకి కాదు.. దేశవ్యాప్తంగా పేద ముస్లింలకు ప్రధాని మోదీ కానుకలు

Modi Gift To Poor Muslims Saugat E Modi| దేశవ్యాప్తంగా ముస్లిం సమాజానికి చేరువయ్యేందుకు భారతీయ జనతా పార్టీ (బిజేపీ) క‌ృషి చేస్తోంది. రంజాన్ సందర్భంగా బిజేపీ.. “సౌగత్-ఎ-మోదీ” (మోదీ తరపున కానుక) అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 32 లక్షల మంది పేద ముస్లింలకు గిఫ్ట్ ప్యాక్‌లు అందించాలనే నిర్ణయాన్ని తీసుకుంది. కమలం పార్టీ అన్ని మతాలను సమానంగా చూస్తుందంటూ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ముస్లింలకు వ్యతిరేకంగా బిజేపీ వ్యవహరిస్తుందనే ముద్ర బీజేపీపై ఉండడంతో ఆ ఇమేజ్‌ను మార్చడానికే కాషాయ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రంజాన్ సందర్భంగా “సౌగత్-ఎ-మోదీ” అనే పేరుతో ప్రారంభించిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 32 లక్షల మంది పేద ముస్లింలకు బహుమతులను పంపిణీ చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఈ కానుకలు ముఖ్యంగా ముస్లిం కుటుంబాలకు చెందిన మహిళలకు అందజేయబడతాయి. ఈ కార్యక్రమాన్ని మసీదు కమిటీలు, 32 వేల మంది కార్యకర్తల సహకారంతో నిర్వహిస్తున్నారు. మొదటగా ముంబైలో ప్రారంభమైన ఈ కార్యక్రమం, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు.

బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ, బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్ ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేదికపైకి బహుమతులను స్వీకరించడానికి మహిళలు పెద్ద సంఖ్యలో చేరారు.


ముస్లింలకు ఇవ్వబడే గిఫ్ట్ ప్యాక్‌లలో పోషకాహార పదార్ధాలు, కొత్త దుస్తులు, వెర్మిసిల్లి, ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్, చక్కెర తదితర వస్తువులు ఉంటాయి. మహిళలకు సల్వార్ కమీజ్, పురుషులకు కుర్తా పైజామాలు ఇస్తారు. ప్రతి కిట్ విలువ సుమారు రూ. 600 ఉంటుంది. ఈ కానుక రంజాన్ పండుగ సందర్బంగా పేద ముస్లింలకు ఉపయోగపడతాయని భావించి అందిస్తున్నారు. బీజేపీ మైనారిటీ మోర్చా నేతలకు లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత అప్పగించారు. మసీదు కమిటీ 100 మంది పేద ముస్లింలను ఎంపిక చేసి, ఆ జాబితాను నిర్వాహకులకు అందిస్తుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 20న ఈస్టర్ సందర్బంగా క్రైస్తవులకు, ఏప్రిల్ 14న బైసాఖి సందర్భంగా సిక్కులకు కూడా విస్తరించనున్నట్లు సమాచారం.

Also Read: శివసేనను విమర్శిస్తూ వీడియో చేసిన కునాల్ కమ్రా.. ముక్కలుగా నరికేస్తామంటూ బెదిరింపు కాల్స్..

బీజేపీ “సౌగత్-ఎ-మోదీ” కార్యక్రమాన్ని ఒక గొప్ప చొరవగా భావిస్తుండగా.. ప్రతిపక్షాలు దీనిని విమర్శించాయి. టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్, ఈ కార్యక్రమం ముస్లింలను ఆకర్షించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నం అని అన్నారు. త్వరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బీహార్‌లో ముస్లింల ఓట్ల శాతం ఎక్కువగా ఉండటంతో, బీజేపీ ఈ కార్యక్రమాన్ని రాబోయే ఎన్నికలలో విజయం సాధించడానికి ఉపయోగించుకుంటుందని విమర్శించారు. ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ కూడా బీజేపీ ఈ కార్యక్రమాన్ని ముస్లిం ఓట్లు పొందేందుకు చేపడుతున్న ఎత్తు అని అన్నారు.

ఇక, బీజేపీ చేపట్టిన “సౌగత్-ఎ-మోదీ” కార్యక్రమాన్ని ముస్లిం మతపెద్దలు స్వాగతిస్తున్నారు. వారు బీజేపీపై ఉన్న చెడు అభిప్రాయం దూరమవుతుందని అభిప్రాయపడుతున్నారు.

Tags

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×