BigTV English

Illu Illalu Pillalu Today Episode: చందు కోసం తెగించేసిన శ్రీవల్లి.. ధీరజ్ కు షాకిచ్చిన రామరాజు..

Illu Illalu Pillalu Today Episode: చందు కోసం తెగించేసిన శ్రీవల్లి.. ధీరజ్ కు షాకిచ్చిన రామరాజు..

Illu Illalu Pillalu Today Episode March 26th: నిన్నటి ఎపిసోడ్ లో.. పోలీస్ స్టేషన్ నుంచి అర్జంట్ గా రమ్మని ఫోన్ వస్తుంది. అక్కడికి వెళ్తారు. రామరాజు ఫ్యామిలీ ఇటు భద్ర వల్ల ఫ్యామిలీ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు అక్కడ ప్రేమను చూసి షాక్ అవుతారు నువ్వేంటి ప్రేమ ఎక్కడున్నావంటే.. ఈ అమ్మాయిని వాళ్ళ అన్నయ్య కొట్టాడని కేసు పెట్టింది ఇంట్లోంచి మెడ పట్టు గెంటేసాడు అంటూ క్రిమినల్ కేసు పెట్టడంతో ఈ కేసు స్ట్రాంగ్ ఏంది విశ్వం ఆ కేసును వెనక్కి తీసుకుంటే ఈ అమ్మాయి ఆ కేసును వెనక్కి తీసుకుంటానని అంటుంది ఇది చాలా క్రిటికల్ కేసు. ఈ కేసులో బెయిల్ కూడా రాదు ఆ అబ్బాయి చందుకు నాలుగు రోజులు అయిన తర్వాత బెయిల్ రావచ్చు.  ఎస్ఐ అనగానే భద్ర టెన్షన్ పడుతుంది వెంటనే మేము కేసు వెనక్కి తీసుకుంటామని అంటుంది. విశ్వం చేత కేసు వెనక్కి తీసుకునేలా చేస్తుంది. ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది. అక్కడికి వచ్చి నువ్వు బాగా చేశావు పుట్టింటికి నువ్వు మంచి పని చేశావు ఆ దుర్మార్గున్ని పెళ్లి చేసుకొని నువ్వు చాలా మారిపోయావు అనేసి అంటుంది. ఎంత చెప్పాలని చూసినా కూడా భద్ర వినకపోగా ప్రేమనే తిడుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సేన చందుగాడు జైలుకెళ్లకపోయిన పర్లేదు వాడికి పెళ్లయితే క్యాన్సిల్ అయింది కదా అది మన సంతోషంగా ఫీల్ అవుదామని అంటారు. అప్పుడే భాగ్యం శ్రీవల్లిని తీసుకొని రామ రాజు ఇంటికి వెళ్తుంది. ఏమైంది చెల్లెమ్మ ఏం జరిగింది అని అడిగితే మా అమ్మాయి మీ అబ్బాయిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోదంట. మీ అబ్బాయి మంచితనము తల్లిదండ్రులకు ఇచ్చే మర్యాద మా అమ్మాయికి బాగా నచ్చేసాయి అంట చేసుకుంటే జీవితంలో అతనే చేసుకుంటానని అంటుంది మీరే న్యాయం చెప్పండి అన్నగారు ఏం చేయాలో అని భాగ్యం అంటుంది.

అది కావాలనే వాళ్ళు పెట్టారు అన్న కేసు తప్ప మా వాడు నిజంగానే తప్పు చేయలేదమ్మా అని అనగానే భాగ్యం మీ కూతురు లాగా నా కూతుర్ని ఆలోచించి చెప్పండి అని అంటే నా కొడుకు చాలా మంచివాడు పెద్దలంటే గౌరవం ఉన్నవాడు నీ కూతుర్ని బాగా చూసుకుంటాడు అని చెప్పగానే భాగ్యం మీరు ఇంతగా చెప్తున్నారు కదా మరి ఈ పెళ్లి నాకు ఓకే రేపు నిశ్చితార్థం పెట్టేసుకుందామని అంటుంది.


వేదవతి తన పెద్ద కోడలు చేసిన పనికి మెచ్చుకొని అమ్మ శ్రీ వల్లి ఇలా రాణి దగ్గర తీసుకుంటుంది కౌగిలించుకుంటుంది నువ్వు చాలా మంచి మనసు నీ మంచి మనసుకి నా పెద్ద కొడుకు ఎప్పుడు కష్టం కలిగించాడు వాడు చాలా మంచోడు అని అంటుంది. నాకు ఉత్తమమైన కోడలు అంటే అది నువ్వే నీలాంటి కోడలు దొరకడం నా అదృష్టం నిన్ను నా కూతురు లాగా చూసుకుంటానని వేదవతి శ్రీవల్లి పై ప్రశంసలు కురిపిస్తుంది. శ్రీవల్లి పై ప్రేమను కురిపించడంతో అది చూసిన నర్మదా అబ్బో అని అనుకుంటుంది.

ఇక సాయంత్రం నర్మదను టీ పెట్టమని భుజ్జమ్మ అడుగుతుంది. కానీ నర్మద మాత్రం అటూ ఇటూ తిరుగుతుంది కానీ టీ పెట్టదు. ఏమైంది ఎందుకు నువ్వు టీ పెట్టట్లేదు అని అంటే.. మాదేముందిలెండి రేపు మీ పెద్ద కోడలు వస్తుంది కదా ఆమె మీకు దగ్గరుండి టీ పెడుతుంది ఆమె చేత్తోని టీ తాగండి ఆమెతోనే మీరు మాట్లాడుకోండి. అనని అంటుంది ఇలా చేస్తున్నావ్ ఏంటే కొత్తగా అనేసి అనగానే అప్పుడు మీ కోడల్ని తెగ పొగిడేసారు కదా పెళ్లి నేను ఇన్ని రోజులైంది కదా ఇంటికి వచ్చి ఏ రోజైనా నన్ను ఒక మాట అన్నారు పొగిడారా అని అడుగుతుంది ఓ నీ కోపానికి అదే కారణం అని బుజ్జమ్మ అంటుంది.

అలా అనకపోతే ఆ అమ్మాయిని బుట్టలో వేసుకున్నట్టు కాదు కదా అని వేదవతి నర్మదకు చెప్తుంది. ఇక తర్వాత ఉదయం అందరూ నిశ్చితార్థానికి వెళ్లడానికి రెడీ అవుతారు. ధీరజ్ కూడా అక్కడికి వస్తాడు కానీ మాత్రం వీడు మాత్రం రావడానికి వీలు లేదు ఆ అమ్మాయిని రమ్మని చెప్పు అని బుజ్జమ్మకి చెప్తాడు. ఆ మాట వినగానే దీరస్తుపాటు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. వాడు రాకుండా ఎలా అండి వాడికి సొంత అన్నా నిశ్చితార్థం జరుగుతుంటే వారిని రావద్దంటారు అంటే నీ బుజ్జమ్మ అడుగుతుంది.

మొన్న రెండుసార్లు పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చింది అది వాడివల్లే ఒకసారి ఏమో మీ అబ్బాయి ఎదురింటి అమ్మాయి నగలు తీసుకొని వెళ్ళిపోయాడు కదా అని అడిగింది నిన్న అవన్నీ జైల్లో పడేలా చేసాడు ఇక ఇప్పుడు నిశ్చితార్థం పెళ్లి ఆగిపోయే పరిస్థితి కూడా రావచ్చు అందుకే వాన్ని రావద్దని చెప్పు అనేసి అంటారు. నీకు అది అర్థం చేసుకున్న ధీరజ్ నువ్వు చాలా సంతోషంగా ఉండాలి అన్నయ్య నేను ఎప్పుడూ నీ సంతోషాన్ని కోరుకునే వాడిని అనేసి మీరందరూ వెళ్లే అంటాడు . ఆ తర్వాత భాగ్యం వాళ్ళు గుడిలో ఉంటారు శ్రీవల్లి గుడిలో ఎంగేజ్మెంట్ అంటే క్యాన్సల్ అవుతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో చందు ఎంగేజ్మెంట్ జరుగుతుందా లేదా అన్నది చూడాలి..

Related News

Brahmamudi Serial Today August 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ను తిట్టిన కావ్య – ప్రేమ లేకపోతే ఎందుకొచ్చావన్న రాజ్‌   

Illu Illalu Pillalu Today Episode: తప్పించుకున్న ఆనందరావు.. భద్రకు దొరికేశాడు.. మొత్తం నిజం కక్కేసాడుగా..

Intinti Ramayanam Today Episode: ఇంట్లోంచి లేచిపోతున్న ప్రణతి, భరత్.. అక్షయ్ ను కూల్ చేసిన అవని… భరత్ ను టార్గెట్ చేసిన పల్లవి..

Gundeninda GudiGantalu Today episode: మీనాకు షాకిచ్చిన పోలీసులు.. రోహిణికి దొరికిపోయిన కల్పన..

Today Movies in TV : శుక్రవారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్…

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్, ప్రేమ గొడవ.. సాగర్, నర్మద సరసాలు.. శ్రీవల్లికి టెన్షన్..

Big Stories

×