Notice to eCommerce sites: మన దేశం, పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి. కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రమూకల లక్ష్యంగా మన దేశ సైనికులు దాడులు చేసిన విషయం తెలిసిందే. మన దేశ పౌరులను పొట్టన బెట్టుకొన్న పాకిస్తాన్ ఉగ్ర మూకలకు తగిన గుణపాఠం చెప్పడంతో పాక్ గజగజ వణికింది.
అయితే మన దేశంలో పాకిస్తాన్ ఆనవాళ్ళు లేకుండా చేయాలన్నదే ఇండియన్స్ అభిప్రాయం. తాజాగా పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చిన టర్కీ దేశానికి సైతం ఆ దేశ వస్తువులు కొనుగోలు చేయవద్దని ఇప్పటికే పలువురు డిమాండ్ తీసుకువచ్చారు. తాజాగా పాకిస్తాన్ జెండాలను విక్రయిస్తున్న పలు ఈ కామర్స్ సంస్థలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది.
వివరాలలోకి వెళితే..
దేశ భద్రత, గౌరవానికి విరుద్ధంగా పనిచేసే చర్యలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. పాకిస్తాన్ జెండాలు, సంబంధిత వస్తువులు భారతదేశంలో విక్రయిస్తున్నందుకు అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, ఉబుయ్ ఇండియా, ఎట్సీ, ఫ్లాగ్ కంపెనీ, ఫ్లాగ్ కార్పొరేషన్‌లకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నోటీసులు జారీ చేసింది.
ఈ విషయంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. దేశ సమైక్యత, గౌరవాన్ని భంగపరిచే కంటెంట్‌ను ప్రసారం చేయడం భరించరాదు. జాతీయ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరించనివారు కఠిన చర్యలు ఎదుర్కొంటారని మంత్రి హెచ్చరించారు.
ఈ-కామర్స్ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్స్‌పై ఉన్న పాకిస్తాన్ జెండాలు, చిహ్నాలు, మరే ఇతర అనుచిత కంటెంట్ అయినా తక్షణమే తొలగించాలన్న ఆదేశాలు జారీ చేశారు. అటువంటి కంటెంట్ భారత పతాక నియమావళి, విదేశీ సంబంధ చట్టాలు, వినియోగదారుల హక్కులకు విరుద్ధమని కేంద్రం స్పష్టం చేసింది.
Also Read: Tirumala Rules: నేటి నుండి తిరుమలలో కొత్త రూల్.. ఇకపై ఆ లేఖలకు గ్రీన్ సిగ్నల్..
దేశభక్తి భావాలను రక్షించేందుకు తీసుకున్న ఈ చర్యలు ప్రజల నుంచి మద్దతు పొందుతున్నాయి. దేశవాళీ ఈ-కామర్స్ వేదికల బాధ్యతా ధోరణి పట్ల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశానికి వ్యతిరేకంగా ఉండే చిహ్నాలు, ఉత్పత్తుల ప్రదర్శనపై కనీస నిబంధనలపై కఠిన పర్యవేక్షణ అవసరం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.