Tamannaah Bhatia:మిల్కీ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న తమన్నా భాటియా (Tamannaah bhatia) తెలుగుతోపాటు తమిళ్, హిందీ సినిమాలలో నటించి, తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 17 ఏళ్లకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ తన క్రేజ్ తో ఆడియన్స్ ను అలరిస్తోంది. ఇకపోతే ఈమధ్య కాలంలో కొత్త హీరోయిన్స్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో.. ఈమెకు హీరోయిన్గా అవకాశాలు తగ్గుతున్నాయి. అయినా సరే స్టార్ హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది తమన్నా. అంతేకాదు ఆ స్పెషల్ సాంగ్స్ కి కూడా హీరోయిన్ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటివరకు సుమారుగా 75 చిత్రాలకు పైగా నటించిన ఈమె ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ అనే హిందీ సినిమాతో తన నటన జీవితాన్ని ఆరంభించింది.
సినిమాలే కాదు స్పెషల్ సాంగ్స్ తో భారీ గుర్తింపు..
అలా హిందీలో మొదలైన ఆమె నటనా ప్రస్థానం.. తెలుగులో ‘శ్రీ’ అనే సినిమాతో మొదలుపెట్టి, ఇప్పటికి తన హవా కొనసాగిస్తోందని చెప్పవచ్చు. ఇకపోతే శ్రీ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ..’హ్యాపీడేస్’ సినిమా ఈమెకు మంచి ఇమేజ్ అందించింది. ఆ తర్వాత ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘ఊసరవెల్లి’, ‘ 100% లవ్’, ‘రచ్చ’, ‘బద్రీనాథ్’, ‘తడాఖా’, ‘బాహుబలి’, ‘ఊపిరి’, ‘ఎఫ్ 1& ఎఫ్ 2’ , ‘సైరా నరసింహారెడ్డి’ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలలో తన గ్లామర్ తో ఆకట్టుకుంది తమన్నా. అంతేకాదు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకున్న ఈ అమ్మడు ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరిస్తోంది. ఇదిలా ఉండగా ప్రముఖ నటుడు విజయ్ వర్మ (Vijay Varma) తో ప్రేమలో పడిన ఈమె, అతడితో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు కలిసి పలు ఈవెంట్లకు వెళ్లడం, వెకేషన్స్ ఎంజాయ్ చేయడం లాంటివి చేస్తూ వచ్చారు.
ప్రియుడికి బ్రేకప్.. రహస్యంగా తమన్నా పెళ్లి..
పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు రాగా.. సడన్గా ఏమైందో తెలియదు కానీ ఇద్దరి ఇంస్టాగ్రామ్ పోస్ట్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇక వీటిని బట్టి చూస్తే వీరిద్దరూ విడిపోయారని స్పష్టం అవుతోంది. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువబడలేదు. అయితే ఇంతలోపే తమన్న విజయ్ తో బ్రేకప్ చెప్పుకొని, రహస్యంగా పెళ్లి చేసుకుంది అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా తనకు నచ్చిన వాడిని ఇప్పుడు తమన్నా రహస్యంగా వివాహం చేసుకుందంటూ.. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. అందరూ నిజమే అనుకున్నారు. కానీ ఆ ఫోటోలను కాస్త తీక్షణంగా చూస్తే అవి ఫేక్ ఫోటోలు అని స్పష్టం అవుతోంది. తాజాగా ఆ ఫోటోలను ఎవరో కొంతమంది మార్ఫింగ్ చేసి మరీ విడుదల చేశారు. అందులో తమన్నా ఫోటో కనిపించడంతో రహస్యంగా పెళ్లి చేసుకుంది అనే వార్తలకు ఆజ్యం పోసినట్టు అయింది. మొత్తానికైతే ఫేక్ ఫోటోల కారణంగా ఇప్పుడు తమన్నా పెళ్లి అంటూ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి.