Big Stories

Jharkhand Floor Test : ఝార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష నేడు.. జేఎంఎం కూటమి విజయం లాంఛనమేనా ?

Jharkhand Floor Test : నేడు ఝార్ఖండ్‌ అసెంబ్లీలో జేఎంఎం ప్రభుత్వ బలపరీక్ష జరుగనుంది. ఉదయం 11 గంటలకు జేఎంఎం బలపరీక్షను ఎదుర్కోనుంది. మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ అరెస్ట్‌తో.. చంపయి సోరెన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో క్యాంప్‌ రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌, జేఎంఎం పార్టీలకు చెందిన 39 మంది ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు తరలించి.. అక్కడ నుంచి శామీర్‌పేటలోని లియోనియా రిసార్ట్‌కు తరలించింది టీపీసీసీ. ఇవాళ అసెంబ్లీలో చంపయ్‌ సోరెన్‌ తన బలాన్ని నిరూపించుకోనున్న నేపథ్యంలో మళ్లీ వారిని తిరిగి ఆదివారం సాయంత్రం ఝార్ఖండ్‌కు తరలించారు. శంషాబాద్‌ విమానాశ్రయ నుంచి రాంచీకి పంపారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ సహా పలువురు పార్టీ నేతలు.

- Advertisement -

బలపరీక్షలో జేఎంఎం కూటమికి అవసరమైన సంఖ్యాబలం ఉండటంతో అధికార పార్టీకి విజయం లాంఛనమేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం శాసనసభ సభ్యులు 81 మంది కాగా.. ఇందులో ఒక్కస్థానం ఖాళీగా ఉంది. బలపరీక్షకు అవసరమైన సంఖ్యా బలం 41. అయితే.. జేఎమ్ఎమ్ సారథ్యంలోని అధికార కూటమికి మొత్తం 46 సీట్లు ఉన్నాయి. ఈ లెక్కన జేఎంఎం కూటమికి ఐదుగురు ఎమ్మెల్యేల బలం ఉంది. జేఎమ్‌ఎమ్‌ ఎమ్మెల్యేలు 28 మంది కాగా.. కాంగ్రెస్‌కు 16, ఆర్జేడీ, సీపీఐకు చెరో ఎమ్మెల్యే ఉన్నారు. ఇక బీజేపీతోపాటు దాని మిత్ర పక్షాలకు 29 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో అనూహ్య, నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప జేఎమ్ఎమ్ సారథ్యంలోని అధికార కూటమి విజయం ఖాయమని రాజకీయవర్గాలు అంటున్నాయి రాజకీయ వర్గాలు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News