BigTV English

Chandrayaan-3 : నేడే నింగిలోకి చంద్రయాన్‌-3.. ప్రయోగానికి సర్వం సిద్ధం..

Chandrayaan-3 : నేడే నింగిలోకి చంద్రయాన్‌-3.. ప్రయోగానికి సర్వం సిద్ధం..

Chandrayaan-3 launch date and time(India today news): చంద్రయాన్‌-3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌.. షార్ లో రాకెట్‌ కౌంట్ డౌన్ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు మొదలైంది. ఈ ప్రక్రియ 25.30 గంటలపాటు కొనసాగుతుంది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాల 13 సెకన్లకు రెండో ప్రయోగ వేదిక నుంచి చంద్రయాన్‌-3తో కూడిన ఎల్‌వీఎం-3 ఎం4 వాహక నౌక నింగిలోకి దూసుకెళుతుంది. ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌, అన్ని విభాగాల డైరెక్టర్లు, సీనియర్‌ శాస్త్రవేత్తలు, ఇస్రో మాజీ అధిపతులు, విశ్రాంత శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని వీక్షించడానికి షార్ కు చేరుకున్నారు.


అంతరిక్ష రంగంలో ఇప్పటికే ఇస్రో తనదైన ముద్ర వేసింది. అయితే 2019లో చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగంలో సమస్యలు తలెత్తాయి. కానీ ఈ సారి మాత్రం విజయం సాధించాలన్న సంకల్పంతో తాజా ప్రయోగానికి సన్నద్ధమైంది. వచ్చే నెలలో చంద్రయాన్‌-3 చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద దిగితే ఆ ఘనత సాధించిన తొలి దేశంగా చరిత్ర సృష్టిస్తుంది. చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ను సాధించిన నాలుగో దేశంగా ఘనత సాధిస్తుంది.

చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం అయ్యేందుకు ఇస్రో అన్ని జాగ్రత్తలు తీసుకుంది. చంద్రయాన్‌-2లో విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లి ఉపరితలంపై దిగుతున్న సమయంలో కూలిపోయింది. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి అనేక మార్పులు చేసింది. ల్యాండింగ్‌ వైఫల్యాన్ని అధిగమించేలా చంద్రయాన్‌-3ని ఇస్రో రూపొందించింది. అవాంతరాలు తలెత్తినా ల్యాండర్‌ విజయవంతంగా కిందకు దిగేలా ఏర్పాట్లు చేసింది. సెన్సార్, ఇంజిన్‌, అల్గోరిథమ్‌, గణన ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంది. సమస్యలు ఎదురైతే సమర్థంగా ఎదుర్కొనేలా అన్ని వ్యవస్థలనూ ప్రోగ్రామ్‌ చేసింది.


Related News

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Big Stories

×