
Chandrayaan 3: చంద్రయాన్ 3 ప్రయోగం ప్రయోజనం నెరవేరినట్టే కనిపిస్తోంది. భవిష్యత్తులో మూన్‌పై మానవ ఆవాసం సాధ్యమయ్యేలా ఉంది. ప్రజ్ఞాన్ రోవర్ కీలక సమాచారాన్ని సేకరించింది. చంద్రుడిపై ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని గుర్తించింది. ఆక్సిజన్ ఉంటే.. మానవ మనుగడ సాధ్యమేగా.
అయితే, ఆక్సిజన్‌ను వాయువుగా కాకుండా మూలకంగా ఉంది. ఇక హైడ్రోజన్ ఆనవాళ్లు సైతం లభిస్తే.. H2O నీటి కొరతా తీరినట్టే.
ఆక్సిజన్‌తో పాటు ఐరన్, కాల్షియం, అల్యూమినియం, క్రోమియం, టైటానియం, సిలికాన్, సల్ఫర్, మాంగనీస్ నిల్వలు ఉన్నట్టు ప్రజ్ఞాన్ రోవర్ పరిశోధనలో తేలింది. కీలకమైన హైడ్రోజన్ కోసం సెర్చ్ కొనసాగుతోందని ఇస్రో తెలిపింది.
రోవర్‌లోని ‘లిబ్స్’ అనే పరికరం చంద్రుడిపై ఉన్న ఖనిజాలు, రసాయనాల కోసం అన్వేషిస్తోంది.