Chandrababu naidu news today : తెలంగాణలో టీడీపీ స్ట్రాటజీ ఇదే.. చంద్రబాబు క్లారిటీ.. అన్నిపార్టీల్లో కలవరం..

TDP party news: టీడీపీ స్ట్రాటజీ ఇదే.. చంద్రబాబు క్లారిటీ.. బీజేపీలో టెన్షన్!

tdp cbn
Share this post with your friends

TDP party news

Chandrababu naidu news today(Telugu flash news):

గత ఎన్నికల్లో తెలంగాణలో మహాకూటమి.. కేసీఆర్‌కు ముచ్చెమటలు పట్టించింది. కాంగ్రెస్, టీడీపీ, గద్దర్, కోదండరాం, మంద కృష్ణ మాదిగ.. ఇలా హేమాహేమీలంతా ఒక్కటయ్యారు. రాహుల్ గాంధీ, చంద్రబాబులు ఒకే వేదికపై కనిపించారు. టీడీపీ బలం ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబు సుడిగాలి పర్యటనలు చేశారు. ఆ ప్రచార హోరును చూసి.. బీఆర్ఎస్ శ్రేణులు ఉలిక్కిపడ్డారు. ఆ కూటమి తమ కొంపముంచేలా ఉందని తెగ టెన్షన్ పడ్డారు. అంతలా కేసీఆర్‌కు కంగారెత్తించారు చంద్రబాబు. అయితే, చివర్లో గులాబీ బాస్ స్టీరింగ్ తిప్పేశారు. చంద్రబాబును తెలంగాణ బూచీగా చూపించి.. ప్రజల్లో మరోసారి సెంటిమెంట్ రాజేసి.. గట్టెక్కేశారు కేసీఆర్. మరి ఈసారి? టీడీపీ దారెటు? పొత్తులు ఉంటాయా? ఏపీలో మాదిరి బీజేపీతో జతకట్టబోతుందా? సింగిల్‌గా బరిలో దిగుతుందా? అసలు పోటీ అయినా చేస్తుందా? అనే ఆసక్తి మొదలైంది.

టీటీడీపీకి కాసాని జ్ఞానేశ్వర్ రూపంలో బలమైన అధ్యక్షుడే ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో టీడీపీకి ఇప్పటికీ మద్దతుదారులు ఉన్నారు. గెలుస్తారా? అంటే చెప్పలేం కానీ.. చెప్పుకోదగ్గ ఓట్లు మాత్రం తెచ్చుకోవచ్చని అంటున్నారు. మరి, ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ట్రయాంగిల్ టఫ్ ఫైట్ జరగనుండగా.. మధ్యలో టీడీపీ ఎంట్రీ ఇస్తే? ఏంటి పరిస్థితి? ఏ పార్టీకి మైనస్? ఎవరి ఓట్లు చీలుతాయి? ఎవరికి లాభం జరుగుతుంది? అనే చర్చ నడుస్తోంది.

ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనల మధ్య పొత్తు పొద్దు పొడుస్తోంది. అదే పొత్తు తెలంగాణలోనూ ఉంటుందా? తెలంగాణలో జనసేన పోటీపై ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. ఇక పొత్తు పెట్టుకుంటే బీజేపీతోనే పెట్టుకోవాలి. మొదట్లో ఏపీ వేరు.. తెలంగాణ వేరు అన్నారు. కానీ, కర్నాటక ఎన్నికల తర్వాత బీజేపీ గ్రాఫ్ దారుణంగా పతనమైంది. రేసులో బాగా వెనకబడింది. ఇలాంటి సమయంలో టీడీపీతో కలిసి పోటీ చేస్తే..? ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం లాంటి జిల్లాల్లో టీడీపీకి ఇప్పటికీ భారీగా ఓటర్లు ఉన్నారు. ఆ ఓట్లు బీజేపీ వైపు మళ్లితే కాస్తైనా లాభం జరగొచ్చు. టీడీపీ గెలవకున్నా.. బీజేపీకి ఓట్లు రాబట్టేందుకు పనికిరావొచ్చు. మరి, చంద్రబాబుతో పొత్తు గతంలో మాదిరి తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తే? అది బూమరాంగ్ కాదా? అనే టెన్షన్ కమలనాథులను ముందడుగు వేయనీయకుండా చేస్తోంది. మరి, టీడీపీ ఏం చేయబోతోంది?

తాజాగా.. తెలంగాణలో పొత్తులు, పోటీపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీతో కలిసి వెళ్లేందుకు సమయం మించిపోయిందన్నారు. ఏపీలో మాత్రం సమయానికి తగ్గట్టు నిర్ణయం ఉంటుందని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. అటు, ఏపీలో ఒకేసారి అన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తామని ప్రకటించారు చంద్రబాబు.

సో, తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందట. అదీ సింగిల్‌గా. ఎలాంటి పొత్తులు లేకుండా. మరి, టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో? ఏ పార్టీ ఓట్లు చీలుస్తుందో? చూడాలి.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Gold Seize : ప్రొద్దుటూరులో ఐటీ రైడ్స్.. ఎన్ని వందల కేజీల బంగారం సీజ్ చేశారంటే..?

Bigtv Digital

KTR : టీవర్క్స్‌లో నిరుద్యోగులతో ఇంటర్వ్యూలు.. కేటీఆర్ కు ఈసీ నోటీసులు

Bigtv Digital

Viveka Murder Case : నేడు సుప్రీంకోర్టులో విచారణ .. తీర్పుపై ఉత్కంఠ..

Bigtv Digital

Bhola Shankar : ‘భోళా శంకర్’ సెట్‌ని సందర్శించిన దర్శకేంద్రుడు

Bigtv Digital

Revanth Reddy : రా కదలిరా.. రేవంత్ రెడ్డి వెయిటింగ్ ఇక్కడ..!

BigTv Desk

Krishna: జేమ్స్ బాండ్.. కౌబాయ్.. కృష్ణకు సరిలేరు ఎవ్వరు..

BigTv Desk

Leave a Comment