BigTV English

Chardham Yatra : చార్‌ధామ్ యాత్ర నిలిపివేత.. యుద్ధం ఎఫెక్ట్.. మళ్లీ ఎప్పుడంటే..

Chardham Yatra : చార్‌ధామ్ యాత్ర నిలిపివేత.. యుద్ధం ఎఫెక్ట్.. మళ్లీ ఎప్పుడంటే..

Chardham Yatra : యుద్ధం అవుటాఫ్ కంట్రోల్‌గా మారింది. డ్రోన్లు, మిస్సైళ్లు, బాలిస్టిక్ క్షిపణులతో తీవ్ర డ్యామేజ్ జరుగుతోంది. ఇండియా, పాకిస్తాన్ మధ్య ఓ రేంజ్‌లో వార్ నడుస్తోంది. పాక్ ప్రధానంగా జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లను టార్గెట్‌గా చేసుకుని అటాక్ చేస్తోంది. శ్రీనగర్ ఎయిర్‌పోర్టు సమీపంలో 5 డ్రోన్ బాంబులు పేలడం ఆందోళన కలిగించే విషయం. వెంటనే నార్త్, వెస్ట్ ఇండియాలోని 32 విమానాశ్రయాలను మూసేసింది కేంద్రం. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చార్ ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ చార్ ధామ్ యాత్రను రద్దు నిలిపివేస్తున్నట్టు ఓ ప్రకటన విడుదల చేసింది కేంద్రం.


ఆలయాలే పాక్ టార్గెట్

ఇప్పటికే జమ్మూకశ్మీర్‌లోని వైష్ణో దేవి ఆలయం టార్గెట్‌గా పాకిస్తాన్ పలుమార్లు డ్రోన్లతో అటాక్ చేసింది. ఇండియన్ ఆర్మీ వాటిని ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది. హిందూ దేవాలయాలపై కన్నేసిన పాకిస్తాన్.. చార్ ధామ్ యాత్రపైనా అటాక్ చేసే అవకాశం ఉంటుందని భావిస్తోంది. అందుకే, ప్రస్తుత పరిస్థితుల్లో కొంతకాలం పాటు చార్‌ధామ్ యాత్రను నిలిపివేయాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. బద్రినాత్‌, కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రికి వెళ్లే భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చార్ ధామ్ యాత్ర కొనసాగించవద్దని వెల్లడించింది. అలాగే, అక్కడ హెలికాప్టర్ సేవలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.


చార్‌ధామ్ షెడ్యూల్ ఇదే..

ఏప్రిల్ 30న చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఆ 4 పుణ్య క్షేత్రాలను 2.9 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. యాత్ర ప్రారంభానికి 40 రోజుల ముందు నుంచే ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఆధార్ వెరిఫికేషన్, కీలక డాక్యుమెంట్లను వెరిఫై చేసి.. లక్షలాది భక్తులకు యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. యమునోత్రి, గంగోత్రి ధామ్ తలుపులు ఏప్రిల్ 30న తెరుచుకున్నాయి. కేదార్‌నాథ్ ధామ్ ఆలయం మే 2న, బద్రీనాథ్ ధామ్ మే 4న భక్తుల కోసం ఓపెన్ అయ్యాయి. ఆన్ లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులను యాత్రకు అనుమతిస్తారు. హిందువులకు అత్యంత పవిత్రమైన ఈ చార్ ధామ్ యాత్ర.. హిమాలయాల్లోని యమునోత్రితో ప్రారంభమై గంగోత్రి, కేదార్ నాథ్ మీదుగా వెళ్లి బద్రీనాథ్‌తో ముగుస్తుంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం దెబ్బకు చార్ ధామ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి.

Also Read : అసలైన యుద్ధం షురూ.. హైరేంజ్‌లో వార్.. కంప్లీట్ డీటైల్స్

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×