E-Paper
Advertisement

రేషన్‌కార్డు దారులకు శుభవార్త.. రేషన్ ఏటీఎం వచ్చేశాయి.. ఇక క్యూ అవసరం లేదు

రేషన్‌కార్డు దారులకు శుభవార్త.. రేషన్ ఏటీఎం వచ్చేశాయి.. ఇక క్యూ అవసరం లేదు
Advertisement

Ration ATMs: కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీది టెక్నాలజీతో అనుసంధానం చేస్తున్నాయి. అసలైన లబ్దిదారులకు అందాలని ఆలోచన చేస్తున్నాయి. ఆధార్-బ్యాంక్ అకౌంట్ ఇలా చెప్పుకున్నా పోతే పెద్ద జాబితా ఉంది. ఈ మధ్య స్మార్ట్ కార్డుల పేరుతో రేషన్ మొదలుపెట్టాయి పలు రాష్ట్రాలు. ఈ విషయంలో చత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. ఏకంగా రేషన్ ఏటీఎంలను ప్రారంభించింది. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా ముమ్మాటికీ నిజం.

 

రేషన్‌కార్డు దారులకు శుభవార్త

Advertisement

ఛత్తీస్‌గఢ్ కొత్తగా ప్రజా పంపిణీ వ్యవస్థను ఆధునీకరించేందుకు ఏటీఎం తరహా విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిద్వారా లబ్ధిదారులు నెలవారీ రేషన్‌ను.. బ్యాంకు ఏటీఎం మాదిరిగా 24 నాలుగు గంటలు ఎప్పుడైనా   తీసుకోవచ్చు. అందుకోసం రేషన్ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాయ్‌పూర్‌లోని బిర్‌గావ్ ప్రాంతంలో అన్నపూర్ణ గ్రెయిన్ ఏటీఎంను ప్రారంభించింది.

24 గంటల రేషన్ ఏటీఎంలు వచ్చేశాయి

ఏటీఎం కార్డు మాదిరిగా రేషన్ కార్డులోని వివరాలు ఎంటర్ చేస్తేచాలు. ఆ తర్వాత ఏమేమి కావాలి ఎంటర్ చేయాలి? లబ్దిదారుల డీటేల్స్ ఇచ్చిన తర్వాత కోటా బియ్యం బస్తాలోకి వస్తాయి. 24 గంటలు ఆ తరహా సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏటీఎంలో రేషన్ అయిపోతే దాన్ని ఫుల్ చేయడమే. చత్తీస్‌ఘడ్ ప్రభుత్వం తీసుకొచ్చిన రేషన్ ఏటీఎంలో సుమారు 2500 కిలోల బియ్యం నిల్వ చేయవచ్చు.

తొలిసారి చత్తీస్‌ఘడ్‌లో ప్రారంభం

Advertisement

బియ్యాన్ని ఏటీఎంలో నింపడం మొదలు లబ్ధిదారులకు పంపిణీ చేయడం వరకు మొత్తం ప్రక్రియ ఆటోమేటిక్‌గా జరుగుతుంది. దీనివల్ల వినియోగదారులు తమకు కేటాయించిన రేషన్‌ను సులభంగా పొందవచ్చు. రేషన్ దుకాణాల దగ్గర రద్దీ తగ్గడంతోపాటు, వారి సమయం ఆదా కానుంది. ఈ సదుపాయాన్ని స్థానిక మహిళా స్వయం సహాయక బృందం నిర్వహిస్తోంది.

పని వేళల్లో రేషన్ దుకాణాలకు వెళ్లడం కష్టంగా ఉండే ఉద్యోగ మహిళలు, గృహ బాధ్యతలున్నవారికి ఈ సౌకర్యం ప్రయోజనం చేకూరనుంది. దీనికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో రేషన్ స్టోరేజ్ గోడౌన్లు అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేస్తోంది. ఆ గోడౌన్ వద్ద రేషన్ ఏటీఎం పెడితే సరుకుల అయిపోతామోనన్న దిగులు అవసరం లేదు.

ALSO READ: పార్లమెంటు క్యాంటీన్‌‌లో స్పెషల్ విందు.. 120 మంది ఎంపీలు, అమృత్‌సరీ కుల్చీ-లస్సీల గుబాళింపు 

ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు విధానం కింద ఈ పథకం పని చేస్తుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు, అర్హులైన లబ్ధిదారులు వారి రేషన్ కార్డు ఎక్కడ జారీ చేశారో అనేదానితో సంబంధం ఉండదు. హక్కుగా రావాల్సిన ఆహార ధాన్యాలను పొందుతారు. ఆ తరహా పద్దతితో మానవుల ప్రమేయాన్ని తగ్గించవచ్చు. రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం, పారదర్శకంగా, సమర్థవంతంగా పని చేస్తుందని భావిస్తోంది.

 

 

Related News

ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం ధ్వంసం, నలుగురు దుర్మరణం!

టెంపుల్ పూజారిని చావబాదారు.. అసలు కారణం అదేనా? రంగంలోకి జైపూర్ పోలీసులు, వీడియో వైరల్

చలాన్ల వసూలుకు సుప్రీం కొత్త ఫార్ములా.. కరెంట్ బిల్లులతో లింకప్.. లైసెన్స్ సస్పెండ్‌కు సిఫార్సు!

ఎంపీల అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యం.. న్యాయవ్యవస్థపైనే సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్!

LPUలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. హాస్టల్‌లో లైంగిక దాడి ఆరోపణలు.. రణరంగంగా మారిన క్యాంపస్!

యూపీఐ ఛార్జీల వివాదం.. స్టే ఇచ్చేందుకు సుప్రీం నో.. కానీ కేంద్రానికి కీలక ఆదేశాలు!

పబ్లిక్ టాయిలెట్ లో ఇద్దరు యువకుల శవాలు.. ఎవరు చంపారు?

కోయంబత్తూరు హైవేపై సినిమా తరహాలో.. హెడ్ కానిస్టేబుల్ సాహసం, ఏకంగా 40 కి.మీ ప్రయాణం

Big Stories

Advertisement
×