E-Paper
Advertisement

కోయంబత్తూరు హైవేపై సినిమా తరహాలో.. హెడ్ కానిస్టేబుల్ సాహసం, ఏకంగా 40 కి.మీ ప్రయాణం

కోయంబత్తూరు హైవేపై సినిమా తరహాలో.. హెడ్ కానిస్టేబుల్ సాహసం, ఏకంగా 40 కి.మీ ప్రయాణం
Advertisement

Coimbatore: వెండితెరపై సినిమా చాలా అందంగా కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు రియల్ చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. ఒక్కోసారి ప్రాణాలు సైతం పోయే ఘటనలు ఉంటాయి. సరిగ్గా అలాంటి ఘటన ఒకటి కోయంబత్తూరులో వెలుగు చూసింది. పోలీసుల తనిఖీలను తప్పించుకునేందుకు ఓ గుట్కా గ్యాంగ్ చేసిన పని తీవ్ర కలకలం రేపింది. భయానక ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

కోయంబత్తూరు హైవేపై సినిమా తరహాలో ఘటన

తమిళనాడులోని కోయంబత్తూరులో పోలీసుల తనిఖీలను తప్పించుకునేందుకు గుట్కా గ్యాంగ్ చేసిన పని తీవ్ర కలకలం రేపింది. భారీగా గుట్కా తమిళనాడులోకి ఎంట్రీ అవుతుందన్న సమాచారంతో కోవిల్‌‌పాళయం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. సరిగ్గా బెంగళూరు నుండి తరలిస్తున్న సుమారు 250 కిలోలకు పైగా నిషేధిత గుట్కా ఉత్పత్తులను లోడ్ చేసుకుని వెళ్తున్న ఒక ఎస్‌యూవీని ఆపడానికి పోలీసులు ప్రయత్నించారు.

హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ సాహసం

Advertisement

అయితే కారు డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా దూసుకెళ్లాడు. దీన్ని గమనించిన 38 ఏళ్ల హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ తన ప్రాణాలను లెక్క చేయలేదు. నేరుగా పైటాప్ రూఫ్ రైల్స్‌ను గట్టిగా పట్టుకున్నారు. ఐనప్పటికీ గుట్కా గ్యాంగ్ సభ్యులు వాహనాన్ని ఆపకుండా అత్యంత వేగంగా హైవేపైకి దూసుకెళ్లారు. కొచ్చి-సేలం హైవేపై దాదాపు 40 కిలోమీటర్ల భయంకరమైన దృశ్యాలు ఛేజ్‌గా మారిపోయాయి. వేగంగా వెళ్తున్న ఎస్‌యూవీ కారు పైకప్పుపై హెడ్ కానిస్టేబుల్ తన ప్రాణాలకు తెగించి వేలాడుతూ కనిపించాడు.

ప్రాణాలకు తెగించి గుట్కా గ్యాంగ్‌ని పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్

కానిస్టేబుల్‌ని కింద పడేలా వాహనాన్ని పలుమార్లు కుడివైపు, ఎడమవైపు తిప్పాడు డ్రైవర్. ఈ ప్రమాదకర దృశ్యాలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-ఎన్‌హెచ్‌ఏఐ అంబులెన్స్ సిబ్బంది గమనించి వీడియో తీశారు. దీనిపై సమాచారం అందుకున్న తోటి పోలీసులు, స్థానికుల సహకారంతో గుట్కా గ్యాంగ్‌ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అవినాశి ప్రాంత సమీపంలో ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. బాబు ధార, రాజేష్, సురేష్ అనే అనుమానితులను అరెస్టు చేశారు.

Advertisement

ALSO READ: 59 ఏళ్ల వయసులో ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగం.. 27 ఏళ్ల సుదీర్ఘ పోరాటం

వారి నుంచి భారీ మొత్తంలో నిషేధిత సరుకును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. హెడ్ కానిస్టేబుల్ చేసిన ధైర్యసాహసాలపై నెటిజన్లు, ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

 

 

Related News

59 ఏళ్ల వయసులో ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగం.. 27 ఏళ్ల సుదీర్ఘ పోరాటం

ఢిల్లీలో చెంపదెబ్బ వీడియో కలకలం.. అసలు నిజం బయటపెట్టిన మంత్రి పర్వేష్ వర్మ!

కరెంట్ వాడకంపై కేంద్రం కీలక ఆదేశాలు.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్!

ఢిల్లీలో షాకింగ్ న్యూస్.. ఓ యువకుడిని చెంప దెబ్బ కొట్టిన ఢిల్లీ మంత్రి?

విరిగిన కొండచరియలు.. బద్రీనాథ్ – రిషికేశ్ మధ్య నిలిచిన రాకపోకలు, చిక్కుకున్న 4 వేల యాత్రికులు

యూపీలో మారిన సీన్.. రాహుల్-అఖిలేష్ ఒక్కటయ్యారా? గెలుపు ఎవరిది?

షాకైన వాహనదారుడు, గిటార్‌పై AI రూ. 500 చలాన్! బెంగుళూరులో ఘటన

Big Stories

Advertisement
×