Attack on Priest: షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. టెంపుల్ పూజారిపై కొందరు భౌతికంగా దాడి చేశారు. ఆ సమయంలో పూజారి తనను తాను రక్షించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అసలు పూజారి కొట్టడం వెనుక రెండు కారణాలు బలంగా వినిపిస్తున్నాయి.
రాజస్థాన్ రాజధాని జైపూర్ సిటీలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కర్ధాని ప్రాంతంలో ఉన్న శివాలయంలో రాత్రి సుమారు 7.45 గంటలకు పూజారి రామకృష్ణని స్థానిక వ్యక్తులు దాడి చేశారు. ఆలయానికి సమీపంలో నివసించే వ్యక్తులుగా ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది. వారు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి స్పీకర్ల భజనల శబ్దాన్ని తగ్గించమని పూజారిని కోరడంతో వివాదం మొదలైంది. ఈ విషయంలో స్థానిక యువకుడితో పూజారి వాదిస్తూ కనిపించారు. ఈ క్రమంలో స్థానిక వ్యక్తులు-పూజారి మధ్య మాటల వాగ్వాదానికి చోటు చేసుకుంది.
పూజారిని నేలకు అదిమిపట్టి కొట్టడం మొదలుపెట్టారు. అతడు విలవిలలాడుతున్నప్పుడు పూజారి బట్టలు సైతం చిరిగిపోయాయి. ఈ విషయం తెలియగానే అక్కడున్నవారు జోక్యం చేసుకున్నారు. ఆ వ్యక్తుల చెర నుంచి పూజారిని విడిపించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు పూజారిని రక్షించారు. ఈ ఘటన గురించి కర్ధాని పోలీసులు ఆ విషయాలు బయటపెట్టారు. పండిట్ రామకృష్ణ ఫిర్యాదు మేరకు హరీష్ చతుర్వేది, అతని కొడుకు దేవాన్ష్ లను అరెస్టు చేశారు. శనివారం రాత్రి ఈ ఘటన జరగ్గా, ఆదివారం మధ్యాహ్నం ఫిర్యాదు నమోదైంది.
ఆలయం సమీపంలో ఉండే హరీష్, దేవాంశ్-రితు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ఆలయ ప్రాంగణంలోకి బలవంతంగా ప్రవేశించారు. భక్తి పాటల శబ్దం విషయంలో గొడవకు దిగారు. భక్తుల సమక్షంలో తనపై దాడి చేశారని పూజారి రామకృష్ణ ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ ఘటన స్థానికులు, పూజారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుల కుటుంబం తరఫున ఫిర్యాదు నమోదైంది. దర్యాప్తులో భాగంగా టెంపుల్ లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో పంతులను కొడుతున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. లైంగిక వేధింపుల ఆరోపణ నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. అలాంటిదేమీ లేదని స్థానిక పోలీసులు చెప్పుకొచ్చారు.
जयपुर के एक मंदिर परिसर में बुजुर्ग पुजारी पंडित रामकृष्ण के साथ मारपीट का वीडियो सामने आया है
आरोप हरिश चतुर्वेदी, देवांश और एक महिला पर लगाए गए हैं
मामले की निष्पक्ष जांच के बाद आरोप सही पाए जाने पर कानून के तहत कार्रवाई की मांग की जा रही है#jaipur #rajasthan #temple… pic.twitter.com/oWwk94O6H8
— Article19 India (@Article19_India) September 28, 2026