E-Paper
Advertisement

యూపీఐ ఛార్జీల వివాదం.. స్టే ఇచ్చేందుకు సుప్రీం నో.. కానీ కేంద్రానికి కీలక ఆదేశాలు!

యూపీఐ ఛార్జీల వివాదం.. స్టే ఇచ్చేందుకు సుప్రీం నో.. కానీ కేంద్రానికి కీలక ఆదేశాలు!
Advertisement

UPI MDR Charges: రూ. 2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కొత్త ఛార్జీ విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మాత్రం విచారణకు స్వీకరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. చార్జీల విధానం, దాని ప్రాతిపదికపై సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించింది. అయితే కేంద్రం నుంచి సమాధానం వచ్చే వరకూ ఎండీఆర్ ఉత్తర్వులపై మాత్రం స్టే విధించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

సుప్రీంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం

యూపీఐ ఎండీఆర్ ఛార్జీలకు వ్యతిరేకంగా అడ్వకేట్ అంజన్ దత్తా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ లేవనెత్తిన ప్రశ్నలపై కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్. వెంకటరామన్ వాదనలు వినిపించారు. యూపీఐ వినియోగదారుల్లో 96 శాతం మందిపై ఈ కొత్త చార్జీల ప్రభావం ఉండదని, వారంతా మినహాయింపు పరిధిలోనే ఉంటారని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఈ విధానం వెనుక ఉన్న కారణాలు, అమలు విధానం, సాంకేతిక అంశాలపై సమగ్ర వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్రంతో పాటు RBI, NPCIకి ఉత్తర్వులు పంపింది. అదే సమయంలో స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

అసలేంటీ కొత్త ఎండీఆర్ విధానం?

Advertisement

డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను నిర్వహించే బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, థర్డ్ పార్టీ యాప్‌లకు వ్యాపారులు చెల్లించే రుసుమునే ఎండీఆర్ అంటారు. అయితే గత ఆరేళ్లుగా యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఎండీఆర్ చార్జీలు లేకుండా ప్రభుత్వం ఉచిత సేవలు అందించింది. అయితే కొత్త విధానం ప్రకారం అక్టోబర్ 15 నుంచి రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన వ్యాపార లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తించనుంది. రూ. 75,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో జరిగే పెద్ద లావాదేవీలపై ఈ రుసుము గరిష్టంగా రూ.300 వరకు పరిమితం చేశారు.

Also Read: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. సామాన్యులపై తీవ్ర ప్రభావం.. అలా చేయకపోతే సబ్సిడీ బంద్!

సామాన్యులకు భారం లేనట్లే!

Advertisement

ఈ ఎండీఆర్ రుసుమును కేవలం వ్యాపారులకు మాత్రమే కేంద్రం పరిమితం చేసింది. డిజిటల్ చెల్లింపులు చేసే వినియోగదారులపై ఈ ఛార్జీల భారం ఉండదు. అంతేకాకుండా వ్యాపారులు ఈ చార్జీలను వినియోగదారులపై మోపకుండా చూడాలని కేంద్ర ఆర్థిక శాఖ బ్యాంకులకు సూచించింది. అలాగే యూపీఐ యాప్ ప్రొవైడర్లు ఎలాంటి హిడెన్ చార్జీలు గానీ, ప్లాట్‌ఫామ్ ఫీజులు గానీ వసూలు చేయకూడదని స్పష్టంగా ఆదేశించింది.

Also Read: టైప్ చేసే పనిలేదు.. ChatGPT కొత్త వాయిస్ ఫీచర్ చూస్తే ఆఫీస్ ఉద్యోగులు ఎగిరి గంతులేస్తారు!

Tags

Related News

భార్య ఏడ్చినంత మాత్రాన భర్త వేధించనట్లేనా? ఆత్మహత్య, 498A కేసులో కోర్టు కీలక తీర్పు

రసగుల్లా అని నమ్మించి.. నాటు బాంబు ఇచ్చారు.. నోట్లో వేసుకోగానే పేలి వ్యక్తి మృతి!

డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు

మృత్యుంజయుడు.. ఏనుగు రెండుసార్లు తొక్కినా చెక్కుచెదరలేదు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

భార్య వంట చేయడం లేదని విడాకులిచ్చిన భర్త.. కోర్టు తీర్పు ఇదే

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐటీ కంపెనీ వైస్ ఛైర్మన్‌తోపాటు ఫ్యామిలీ మృతి, ఘటన ఎలా జరిగింది?

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. జవాన్లపై ముష్కరులు కాల్పులు.. తీవ్ర ఉద్రిక్తత!

పెళ్లికి వెళ్తే పదవి నుంచి దించేస్తారా?.. మమ్ముట్టి వివాదం వెనుక అసలు కథ!

Big Stories

Advertisement
×