E-Paper
Advertisement

ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం ధ్వంసం, నలుగురు దుర్మరణం!

ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం ధ్వంసం, నలుగురు దుర్మరణం!
Advertisement

Gas Cylinder: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఫతేపూర్ జిల్లాలోని మాల్వాన్ టౌన్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మంగళవారం స్థానికుడు సురేష్ గుప్తా ఇంట్లో రోజులాగే వంట చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ దెబ్బకు వారి రెండంతస్తుల భవనం క్షణాల్లో కుప్పకూలిపోయింది.

ఒక్కసారిగా కంపించిన పరిసరాలు

Advertisement

ఈ పేలుడు ధాటి ఎంత తీవ్రంగా ఉందంటే.. దాదాపు 200 మీటర్ల పరిధి వరకు భూకంపం వచ్చినట్లు ప్రకంపనలు వచ్చాయి. పేలుడు తీవ్రతకు పక్కనే ఉన్న మరో రెండు ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. అయితే, ఆ సమయంలో ఆ ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.

స్పాట్‌లోనే నలుగురి దుర్మరణం

Advertisement

ఈ ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉన్నాడని పోలీసులు ధ్రువీకరించారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు.

సహాయక చర్యలు ముమ్మరం

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ఇల్లు పూర్తిగా నేలమట్టమవ్వడంతో పాటు ఇరుగుపొరుగున కూడా నష్టం జరగడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు, విషాదఛాయలు అలముకున్నాయి.

Also Read: ఫిట్‌గా కనిపించే వారిలో కూడా గుండెపోటు.. కారణాలు చెప్పిన గుండె డాక్టర్

Tags

Related News

టెంపుల్ పూజారిని చావబాదారు.. అసలు కారణం అదేనా? రంగంలోకి జైపూర్ పోలీసులు, వీడియో వైరల్

చలాన్ల వసూలుకు సుప్రీం కొత్త ఫార్ములా.. కరెంట్ బిల్లులతో లింకప్.. లైసెన్స్ సస్పెండ్‌కు సిఫార్సు!

ఎంపీల అనర్హత పిటిషన్ల విచారణలో జాప్యం.. న్యాయవ్యవస్థపైనే సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్!

LPUలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. హాస్టల్‌లో లైంగిక దాడి ఆరోపణలు.. రణరంగంగా మారిన క్యాంపస్!

యూపీఐ ఛార్జీల వివాదం.. స్టే ఇచ్చేందుకు సుప్రీం నో.. కానీ కేంద్రానికి కీలక ఆదేశాలు!

పబ్లిక్ టాయిలెట్ లో ఇద్దరు యువకుల శవాలు.. ఎవరు చంపారు?

కోయంబత్తూరు హైవేపై సినిమా తరహాలో.. హెడ్ కానిస్టేబుల్ సాహసం, ఏకంగా 40 కి.మీ ప్రయాణం

Big Stories

Advertisement
×