E-Paper
Advertisement

మిడ్ డే మీల్స్‌లో చికెన్ బిర్యానీ.. విద్యార్థులకు పండగే, ఎక్కడో తెలుసా?

మిడ్ డే మీల్స్‌లో చికెన్ బిర్యానీ..  విద్యార్థులకు పండగే, ఎక్కడో తెలుసా?
Advertisement

Vijay Govt: పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు విజ‌య్ ప్ర‌భుత్వం కీలక ప్రతిపాదనను పరిశీలిస్తోంది. తమిళనాడు వ్యాప్తంగా అమలవుతున్న మిడ్ డే మీల్స్ పథకంలో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ ఇచ్చే అంశాన్ని పరిశీలన చేస్తోంది. దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ పథకంలో ముఖ్యమైన మార్పు కానుంది.

విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం! దేశంలోని అన్ని రాష్ట్రాలు మిడ్ డే మీల్స్ పథకాన్ని దాదాపుగా అమలు చేస్తున్నాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అందులోని మెనూ మార్చుతున్నాయి. ఈ విషయంలో ఒక్కో రాష్ట్ర ఒక్కోలా ప్లాన్ చేస్తోంది. ఒకరు వారానికి ఒక్క గుడ్డు పెడుతుంటే, మరొకరు రెండు సార్లు ఇస్తున్నారు. వీటన్నింటికి వినూత్నంగా ఆలోచన చేస్తోంది విజయ్ ప్రభుత్వం.

Advertisement

మిడ్ డే మీల్స్‌లో చికెన్ బిర్యానీ- వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించే అంశాన్ని పరిశీలన చేస్తోంది. ఈ ప్రతిపాదనను ఇప్పటికే సీఎం విజయ్ ముందు ఉంచామని, అది పరిశీలనలో ఉందన్నారు  పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్. ఆగస్టు 5న జరగనున్న రాష్ట్ర బడ్జెట్‌కు ముందు మంగళవారం చెన్నైలోని అన్నా శతాబ్ది గ్రంథాలయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.

రేపో మాపో విజయ్ ప్రభుత్వం నిర్ణయం- వాళ్లు లేవనెత్తిన డిమాండ్లలో చికెన్ బిర్యానీ అంశం ఒకటి. ఈ సందర్భంగా వారానికి ఒకసారి విద్యార్థులకు చికెన్ బిర్యానీ విషయాన్ని తీసుకొచ్చారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న సాంఘిక సంక్షేమ-మహిళా సాధికారత శాఖతో సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.

Advertisement

డ్రాపౌట్లు తగ్గుతాయా?వారానికి ఒకసారి ప్రోటీన్లు అధికంగా ఉండే చికెన్ బిర్యానీ ఇవ్వడం వల్ల విద్యార్థుల ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్నది ప్రభుత్వం ఆలోచన. అంతేకాదు విద్యార్థుల సంక్షేమం, పాఠశాలల్లో హాజరు శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.  చికెన్ బిర్యానీ కంటే తొలుత పాఠశాలలకు సరఫరా చేసే బియ్యం నాణ్యత మెరుగు పరిచే అంశంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది.

ALSO READ: నీట్ పేపర్ లీక్ కేసు.. సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు, ఇక  ఫాస్ట్ ట్రాక్ కోర్టు వంతు

తమిళనాడులో  ఒకటి నుంచి 10వ తరగతి వరకు దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వారంతా మధ్యాహ్న భోజన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. సీఎం అల్పాహార పథకం  ఒకటి నుంచి 8వ తరగతి వరకు 32 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతోంది.మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ విద్యార్థుల వరకు విస్తరిస్తే మరో 8  లక్షల మంది దీని పరిధిలోకి వస్తారని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.  ఆగష్టు మొదటివారంలోపు చికెన్ బిర్యానీ అంశంపై విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Related News

గుజరాత్‌లో తాగునీటి సంక్షోభం.. మోదీ జల్ జీవన్ మిషన్ పై మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు!

జైల్లోనూ మారని బుద్ధి.. ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్‌లో పదుల సంఖ్యలో పో*ర్న్ వీడియోలు!

15 సార్లు అమెజాన్ ఇంటర్‌వ్యూలో ఫెయిల్.. చివరకు అదే కంపెనీలో రూ.కోట్ల జీతానికి జాబ్..

జిన్ పింగ్ రాకకు ముందు.. చైనా రాయబారి ఆసక్తికర పోస్ట్.. ఏమన్నారంటే?

UPSCలో జాబ్స్.. కేంద్ర ప్రభుత్వంలో 212 ఉద్యోగ ఖాళీలు.. వెంటనే అప్లై చేయండి

ఆత్మీయ కౌగిలి.. తిరుక్కురళ్ కానుక.. భారత్ – రష్యా బంధంలో మరో కీలక ఘట్టం!

5G సిగ్నల్ సరిగ్గా రాలేదని.. జియో ఎంప్లాయ్‌ని టవర్‌కే కట్టేశారు!

దేశంలో ఘోరం.. భార్య, ముగ్గురు కూతుళ్లను.. రాయితో కొట్టిచంపిన కిరాతకుడు!

Big Stories

Advertisement
×