Turns Rejections Into Success| ఒక్కసారి ఉద్యోగంలో తిరస్కరణ ఎదురైతేనే చాలామంది నిరాశ చెందుతారు. అలాంటిది ఒకే కంపెనీ 15 సార్లు తిరస్కరిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? చాలామంది ప్రయత్నాలను ఆపేస్తారు. కానీ ఒక వ్యక్తి మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రతి తిరస్కరణను ఒక పాఠంగా తీసుకుని తన నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకున్నాడు. చివరకు అమెజాన్ జర్మనీలో అవకాశం దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎల్‌ఎన్‌సీటీ ప్లేస్‌మెంట్ రికార్డుల ప్రకారం.. అతనికి రూ.1 కోటికి పైగా సాలరీ ప్యాకేజీతో ఉద్యోగ అవకాశం లభించింది.
భోపాల్‌కు చెందిన గంతవ్య మాల్వియా కంప్యూటర్ సైన్స్ విద్యార్థి కాదు. అతను ఎల్‌ఎన్‌సీటీ భోపాల్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చదివాడు. అయితే, చదువుకునే రోజుల నుంచే అతనికి టెక్నాలజీపై ఆసక్తి పెరిగింది. తన కోర్సు పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం కాకుండా కొత్త నైపుణ్యాలను నేర్చుకున్నాడు. అతను డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, పైథాన్, మెషిన్ లెర్నింగ్ వంటి అంశాలపై దృష్టి పెట్టాడు. అలాగే ప్రాక్టికల్ ప్రాజెక్టులపై కూడా పనిచేశాడు. అతను రూపొందించిన ముఖ్యమైన ప్రాజెక్టుల్లో పింగ్‌పాంగ్ అనే ఫుల్ స్టాక్ సోషల్ మీడియా అప్లికేషన్ ఒకటి.
గంతవ్య అమెజాన్‌లో ఉద్యోగం కోసం నిరంతరం ప్రయత్నించాడు. కంపెనీ కెరీర్ పేజీని తరచుగా పరిశీలిస్తూ తనకు సరిపోయే పోస్టులకు దరఖాస్తు చేసేవాడు. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగాలకు కూడా అప్లై చేశాడు. అయితే మొదట్లో అతనికి విజయం దక్కలేదు. అమెజాన్ అతన్ని 15 సార్లు తిరస్కరించింది. అయినప్పటికీ అతను ప్రయత్నాలను ఆపలేదు. ప్రతి ప్రయత్నం మధ్యలో తన టెక్నాలజీ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. చివరకు ఒక దరఖాస్తు అతనికి అమెజాన్ జర్మనీకి షార్ట్‌లిస్ట్ అయ్యే అవకాశం ఇచ్చింది. అతను ఎంపిక ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసి ఉద్యోగాన్ని సాధించాడు.
ఎల్‌ఎన్‌సీటీ ప్లేస్‌మెంట్ రికార్డుల ప్రకారం.. అమెజాన్ నుంచి సుమారు రూ.1.10 కోట్ల ప్యాకేజీతో గంతవ్యకు అవకాశం లభించింది. అయితే అతని విజయానికి కేవలం ప్యాకేజీ మాత్రమే కారణం కా
Also Read: వరుస అపజయాలతో సతమతమవుతున్నారా? కష్టకాలంలో చాణక్యుడి ఈ 5 బోధనలు గుర్తుంచుకోండి
గంతవ్య కెరీర్.. అమెజాన్‌తో ఆగిపోలేదు. ఇటీవల అతను అమెజాన్‌ను వీడి ట్యాక్స్‌ఫిక్స్‌లో చేరుతున్నట్లు ప్రకటించాడు. అతని ప్రయాణం నాన్ సీఎస్ విద్యార్థులకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. డిగ్రీ మీ ప్రారంభాన్ని నిర్ణయించవచ్చు, కానీ నైపుణ్యాలు మీ భవిష్యత్తును మార్చగలవు.