Prajwal Revanna: జైలు గోడల మధ్య శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారంలో మరో సంచలన విషయం వెలుగు చూసింది. బెంగళూరు సెంట్రల్ జైల్లో ఆయన గది నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్, పెన్‌డ్రైవ్‌లను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపగా అందులో దిగ్భ్రాంతికర వీడియోలు బయటపడ్డాయి. ఆయన వాడుతున్న ఫోన్‌లో పదుల సంఖ్యలో పో*ర్న్ వీడియోలను గుర్తించారు. పెన్‌డ్రైవ్‌లో పలు వెబ్ సిరీస్‌లు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలింది.
మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, కేంద్ర మంత్రి కుమారస్వామికి మేనల్లుడైన ప్రజ్వల్ రేవణ్ణ.. ఒక రేప్ కేసులో దోషిగా తేలి ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. అయితే అత్యంత భద్రత కలిగిన జైలు గదిలో ఆయన రహస్యంగా ఫోన్ వాడుతున్నారనే సమాచారం క్రైమ్ బ్రాంచ్ అధికారులకు అందింది. దీంతో గతనెల ఆగస్టు 11న హఠాత్తుగా ప్రజ్వల్ గదిలో సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో రేవణ్ణ వద్ద నుంచి మొబైల్ ఫోన్‌తో పాటు ఛార్జర్, పెన్‌డ్రైవ్, ఒక నోట్‌బుక్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీటిని ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపగా ఈ వీడియోల వ్యవహారం బయటపడింది.
Rape accused & former MP Prajwal Revanna seen casually talking on the phone inside his prison cell while wearing personal clothes instead of the prison uniform. The exact date when video was taken is unknown. CCB had conducted raids & found a phone yesterday in his cell. pic.twitter.com/GtWIT7EVzS
— Deepak Bopanna (@dpkBopanna) August 12, 2026
సాధారణంగా జైల్లోని ఖైదీలపై కఠిన ఆంక్షలు విధిస్తారు. మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ఎలక్ట్రానిక్ వస్తువులను ఉపయోగించడంపై నిషేధం ఉంటుంది. ఒకవేళ అత్యవసరంగా కుటుంబ సభ్యులతో మాట్లాడాల్సి వస్తే.. జైలు యంత్రాంగం అనుమతితో ల్యాండ్‌లైన్ లో మాట్లాడేందుకు అనుమతిస్తారు. కానీ రేవణ్ణ తన గదిలో యదేచ్ఛగా స్మార్ట్‌ఫోన్ వినియోగించడం పలు అనుమానాలకు తావిచ్చింది. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో బడా నేతలకు అందుతున్న ‘వీఐపీ’ సౌకర్యాలపై మళ్లీ చర్చను లేవనెత్తింది. మరోవైపు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు.. ఇప్పటికే ఒక జైలు అధికారిని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.
Phone found inside Prajwal Revanna prison cell contained porn, pen drive had movies. The FSL Analysis has confirmrd this. It's likely that the case will be handed over to SIT. pic.twitter.com/V80EeHHXls
— Deepak Bopanna (@dpkBopanna) September 12, 2026
Also Read: 1980లో ప్రపంచ కప్.. రేడియోలోనే లైవ్, టీమిండియా సత్తాను ప్రపంచానికి చాటిన రోజులవి!
కర్ణాటకలోని హాసన్ జిల్లా హోళేనరసీపురలోని రేవణ్ణ ఫ్యామిలీకి చెందిన ఫామ్ హోస్ లో పనిచేసే 48 ఏళ్ల మహిళపై 2021 నుంచి పలుమార్లు ప్రజ్వల్ అత్యాచారం చేసినట్లు తేలింది. ఆ దారుణాలను ఫోన్లలో రికార్డు చేసి ఎవరికైనా చెబితే ఆన్ లైన్ లో పెడతానని రేవణ్ణ బాధితారులను బెదిరించారు. ఈ కేసులోనే గతేడాది కోర్టు ఆయనను దోషిగా నిర్ధారిస్తూ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తూ కూడా ఆయన మళ్లీ అదే తరహా ఎలక్ట్రానిక్ పరికరాలు, అభ్యంతరకర కంటెంట్‌తో దొరికిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read: 1980s ఫోటో ట్రెండ్ వెనుక పెద్ద స్కామ్.. సైబర్ క్రైమ్ పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్!