E-Paper
Advertisement

ఫ్యాన్స్ కోసం మెగా,అల్లు హీరోలేనా.. మరి మిగిలిన హీరోలు?

ఫ్యాన్స్ కోసం మెగా,అల్లు హీరోలేనా.. మరి మిగిలిన హీరోలు?
Advertisement

Tollywood: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ఇటీవల తన సీనియర్ అభిమానుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 22వ తేదీన ఆయన పుట్టినరోజున పురస్కరించుకొని.. అభిమానులకు రూ.5 లక్షల మేరా ఇన్సూరెన్స్ చేయబోతున్నారట. ఈ విషయాన్ని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక వీడియోని కూడా విడుదల చేశారు.

సీనియర్ అభిమానులకు అండగా మెగాస్టార్ చిరంజీవి..

“గత మూడు దశాబ్దాలుగా కష్టపడి పని చేసిన సీనియర్ అభిమానులు, అప్పటినుంచి ఇప్పటివరకు థియేటర్ల దగ్గర కష్టపడిన వాళ్లు, కటౌట్లు కట్టి, పూలదండలు వేసి, పాలాభిషేకాలు చేసి, సేవా కార్యక్రమాలు చేసిన ఎంతోమంది సీనియర్ అభిమానులు ఉన్నారు. ఇప్పుడు వారందరినీ గుర్తించే పనిలో పడ్డాము. ఈ పుట్టినరోజున చిరంజీవి సీనియర్ అభిమానులను గుర్తించి వారందరికీ ఒక్కొక్కరికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ పాలసీ అఖిల భారత చిరంజీవి సంఘం తరఫున ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము” అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తన మేనమామ బాటలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కూడా నడుస్తున్నారని చెప్పవచ్చు.

Advertisement

also read:లెనిన్ విషయంలో డిసప్పాయింట్ అయ్యాను – ఎస్. తమన్

మేనమామ బాటలో ఫ్యాన్స్ కి ఇన్సూరెన్స్ ప్రకటించిన అల్లు అర్జున్..

విషయంలోకి వెళ్తే హైదరాబాదులోని యూసుఫ్ గూడా లో జూలై 28వ తేదీన ఒక ప్రైవేటు హోటల్ లో సుమారుగా 600 మంది అభిమానులతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఫ్యాన్స్ మీట్ నిర్వహించగా.. అందులో పాల్గొన్న అల్లు అర్జున్ అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. తన ఆర్గనైజేషన్లో నడుస్తున్న ఈ ఫ్యాన్ మీట్ లో సభ్యులుగా ఉన్న వాళ్లందరికీ అల్లు అర్జున్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయించారు. రాష్ట్ర స్థాయి సభ్యులకు రూ.5లక్షలు, జిల్లాస్థాయి సభ్యులకు రూ.3లక్షల గాను ఇన్సూరెన్స్ చేయించారు. ఈ మేరకు ఇన్సూరెన్స్ కార్డ్స్ ని కూడా ఫాన్స్ అసోసియేషన్ సభ్యులకు అందించారు. ఇక ఈ కార్డులు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అభిమానులను మిగతా హీరోలు పట్టించుకోరా?

Advertisement

ఇకపోతే ఇదంతా బాగానే ఉంది.. ముఖ్యంగా సెలబ్రిటీల కోసం , వారి ఎదుగుదల కోసం, గుర్తింపు కోసం అభిమానులు ఎంత కష్టపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఆ కష్టాన్ని మెగా, అల్లు హీరోలు మాత్రమే గుర్తించారా? ఇక మిగతా హీరోలు.. అభిమానుల గురించి పట్టించుకోవడం లేదా అనే అనుమానాలు ప్రశ్నలు సోషల్ మీడియాలో తలెత్తుతున్నాయి. తమకోసం ఇంత కష్టపడుతున్న అభిమానుల కోసం మిగిలిన హీరోలు ఏదైనా చేయడానికి ముందుకెందుకు రావడం లేదు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు.. చూద్దాం ఇప్పుడిప్పుడే అభిమానుల కోసం సెలబ్రిటీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి భవిష్యత్తులో మిగిలిన హీరోలు కూడా వీరి బాటలోనే ఏదైనా సహాయం అందిస్తారేమో అంటూ కూడా ఇంకొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఏదిఏమైనా తమకు అండగా నిలుస్తున్న అభిమానుల కోసం అండగా నిలవడానికి.. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ తీసుకున్న ఈ నిర్ణయాలు నిజంగా ప్రశంసనీయమని చెప్పవచ్చు.

Related News

ఆదర్శ కుటుంబం నుంచి సంపూర్ణ ఇంట్రడక్షన్ వీడియో.. డైలాగ్స్ అదుర్స్!

లెనిన్ విషయంలో డిసప్పాయింట్ అయ్యాను – ఎస్. తమన్

సాయి పల్లవి కెరీర్‌లో మరో బిగ్ టర్నింగ్.. భారీ సినిమాలో ఛాన్స్!

అమ్మగా ప్రమోట్ అయిన టాలీవుడ్ బ్యూటీ..పాప ఫోటోలు వైరల్!

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత !

ప్రేమలో మోసపోయిన స్టార్ హీరోయిన్లు వీళ్లే!

పావలా శ్యామల మృతిపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్వీట్ వైరల్!

Big Stories

Advertisement
×