BigTV English

Heavy Floods in Arunachal Pradesh: అరుణాచల్‌లో భారీ వరదలు.. 40 మంది మృతి!

Heavy Floods in Arunachal Pradesh: అరుణాచల్‌లో భారీ వరదలు.. 40 మంది మృతి!

Cloudburst Triggers Heavy floods in In Arunachal Pradesh and Assam: అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు, వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. రాజధాని అయిన ఈటానగర్ లో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరుచుకుపడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కారణంగా ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. వరదలు కారణంగా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది.


అరుణాచల్‌లో ఇంకా వరద ఉధృతి కొనసాగుతుంది. పది జిల్లాల్లో లక్షా 17వేల మంది ప్రజలు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం 968 గ్రామాలు నీట మునిగినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు నదీ తీరాలు, కొండ చరియలు విరిగిపడే ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. కాగా రాబోయే ఐదు రోజులు అరుణాచల్ ప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read: అదృష్టం ఆ రైతుదే.. 25 లక్షల విలువ చేసే వజ్రం దొరికింది


అసోంలో  కూడా వరద వధృతి కొనసాగుతోందని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వా శర్మ పేర్కొన్నారు. అసోంలో ఇప్పటి వరకు వరదల కారణంగా సుమారు 40 మంది మృతి చెందారు. అక్కడ అధికారులు 134 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. వర్షం కారణంగా అనేక ఇళ్లు ధ్వంసం అవ్వగా రహదారులు వంతెనలు దెబ్బతిన్నాయి. బరాక్‌లోని కరీంగంజ్‌లోని కుషియారా నది ఎక్కువగా ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు.

Related News

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Big Stories

×