E-Paper
Advertisement

సీఎం విజయ్ ఓ అడుగు ముందుకు.. ఉచిత బస్సు ప్రయాణం డీలక్స్ వరకు, మహిళల్లో ఒకటే ఆనందం

సీఎం విజయ్ ఓ అడుగు ముందుకు.. ఉచిత బస్సు ప్రయాణం డీలక్స్ వరకు, మహిళల్లో ఒకటే ఆనందం
Advertisement

Chennai: తమిళనాడు సీఎం విజయ్ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత విస్తరించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం వెట్రి పయనం పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించారు. చెన్నైలోని కోయంబేడు బస్ టెర్మినస్‌‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా హాజరయ్యారు. బస్సు ఎక్కి మహిళా ప్రయాణికులకు ఉచిత టికెట్లు అందజేసి పథకాన్ని ప్రారంభించారు.

ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించిన సీఎం విజయ్

ఇప్పటివరకు ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రధానంగా నిర్దిష్ట సాధారణ బస్సు సర్వీసులకు మాత్రమే పరిమితమై ఉండేది. ఈ పథకాన్ని మరిన్ని సర్వీసులకు విస్తరించారు. ఇకపై మెట్రోపాలిటన్, పట్టణ ప్రాంతాల్లో నడిచే ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. 40 కిలోమీటర్లు దాటిన మొఫుసిల్ ఆర్డినరీ, ఘాటు రోడ్డు ప్రాంతాల్లోని బస్సులకు ఈ పథకం వర్తించనుంది. ఉచిత పథకం విస్తరణతో రాష్ట్రంలోని ప్రభుత్వ రవాణా సంస్థలకు చెందిన 12,692 బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చింది.

నార్మల్ బస్సుల నుంచి డీలక్స్ వరకు మహిళలకు ఉచితం

Advertisement

ఈ పథకం ద్వారా ప్రతిరోజూ సుమారు 84.32 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతారని ఓ అంచనా. ఈ పథకం ద్వారా ఉద్యోగాలు చేసే మహిళలు, కళాశాలలు, ఇతర పనుల కోసం ప్రయాణించే మహిళల ఖర్చులు తగ్గించడమే ముఖ్య ఉద్దేశం. అన్ని వర్గాల మహిళలతో పాటు ట్రాన్స్‌జెండర్లకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. ఈ ప్రయోజనాన్ని పొందడానికి మహిళలకు ఎలాంటి ఆదాయ పరిమితి లేదని, లబ్ధిదారులు రోజులో ఎన్నిసార్లు అయినా ప్రయాణించవచ్చని తెలిపింది. దానిపై ఎటువంటి ఆంక్షలు లేవని ప్రభుత్వం వెల్లడించింది.

84 లక్షల మందికి లబ్ది, ఎలాంటి ఆంక్షలు లేవని వెల్లడి

ఈ పథకం కింద కవర్ చేయబడిన సర్వీసులు రాష్ట్రంలోని షెడ్యూల్డ్ సింగిల్ ట్రిప్పులలో దాదాపు 85 శాతం వాటాను కలిగి వుంది. ప్రారంభోత్సవంలో సీఎం విజయ్ ప్రయాణికులతో ఈ పథకం గురించి మాట్లాడారు. స్టేట్ ఎక్స్‌ప్రెస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్- ఎస్ఈటీసీ బస్సులకు ఈ పథకం నుంచి మినహాయింపు ఇచ్చింది విజయ్ ప్రభుత్వం. రవాణా ఖర్చులను తొలగించడం ద్వారా మహిళల విద్య, ఉపాధి, జీవనోపాధి, ఆర్థిక సాధికారతకు మద్దతు ఇవ్వడమే ఈ పథకం లక్ష్యమని రవాణా శాఖ మంత్రి విజయ తమిళన్ పార్థిబన్ అన్నారు.

Advertisement

ALSO READ: కెప్టెన్ స్మిత్‌తో ప్రధాని ఫోన్ కాల్.. దేశానికే గర్వకారణమని ప్రశంసలు.. ఏడ్చేసిన పైలట్!

 

Related News

ఢిల్లీలో హైటెన్షన్.. మెట్రో, ఇంటర్నెట్ సేవలు బంద్.. రంగంలోకి 5 వేల బలగాలు!

కెప్టెన్ స్మిత్‌తో ప్రధాని ఫోన్ కాల్.. దేశానికే గర్వకారణమని ప్రశంసలు.. ఏడ్చేసిన పైలట్!

లాడ్జిలో ప్రియుడితో ఓ మహిళ.. సుపారీ గ్యాంగ్‌తో భార్య ఎంట్రీ, చివరకు అక్కడ ఏం జరిగిందంటే..

అత్తింట్లో నవ వధువుకు చుక్కలు.. రూ. 50 వేలు ఇస్తే బాత్రూం, చివరకు ఏం జరిగిందంటే

దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 నుంచి 8 వరకు భారీ నిరసనలు.. కారణం ఇదే!

బంధువుతో వివాహేతర బంధం.. అడ్డుగా ఉన్న భర్తను చంపేందుకు.. ఏకంగా భూమిని అమ్మేసిన భార్య!

కెప్టెన్ మచ్చర్‌‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. కో-పైలట్ వివరాలు గోప్యంగా ఉంచుతున్న ఏజెన్సీలు

Big Stories

Advertisement
×