E-Paper
Advertisement

కెప్టెన్ స్మిత్‌తో ప్రధాని ఫోన్ కాల్.. దేశానికే గర్వకారణమని ప్రశంసలు.. ఏడ్చేసిన పైలట్!

కెప్టెన్ స్మిత్‌తో ప్రధాని ఫోన్ కాల్.. దేశానికే గర్వకారణమని ప్రశంసలు.. ఏడ్చేసిన పైలట్!
Advertisement

PM Modi: ఫ్లైదుబాయ్ విమానంలో కో- పైలట్ కుట్రను భగ్నం చేసి వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. తీవ్ర గాయాలైనప్పటికీ ధైర్యంతో వ్యవహరించి, పెను ప్రమాదాన్ని తప్పించిన ఆయన సాహసాన్ని కొనియాడారు. శుక్రవారం కెప్టెన్ స్మిత్‌తో కాల్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

పైలెట్‌పై మోదీ ప్రశంసల జల్లు..

ఆసుపత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్‌తో వీడియో కాల్ లో మాట్లాడిన మోదీ.. పైలెట్ చూపిన ధైర్య సాహాసాలను కొనియాడారు. ‘మీ శరీరంపై అంత పెద్ద గాయమైనప్పటికీ, చావుబతుకుల మధ్య పోరాడుతున్నప్పటికీ మీ ప్రాణాలను లెక్కచేయలేదు. విమానంలో ఉన్న ప్రయాణికుల ప్రాణాలకే మీరు ప్రాధాన్యత ఇచ్చారు. మీ ధైర్యం, సమయస్ఫూర్తి వల్లనే ఈ రోజు ఎన్నో కుటుంబాలు సురక్షితంగా ఉన్నాయి’ అని పైలెట్ పై ప్రశంసస జల్లు కురిపించారు.

Advertisement

‘భారతీయులకు గర్వకారణం’

కెప్టెన్ స్మిత్ చూపిన సాహసం దేశానికే గర్వకారణమని ఈ సందర్భంగా ప్రధాని మోదీ కొనియాడారు. ‘మీరు చేసిన ఈ వీరోచిత పోరాటం 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని పెంచింది. నా హృదయపూర్వకంగా మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ సంభాషణ సందర్భంగా కెప్టెన్ స్మిత్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఆ సమయంలో నేను చావుబతుకుల మధ్య పోరాడాను. ఒంటిపై తీవ్ర గాయాలతో కిందపడిపోయాను’ అని కంటతడి పెడుతూ ఆ భయాందోళన క్షణాలను గుర్తుచేసుకున్నారు.

Advertisement

Also Read: BSNL సంచలన ఆఫర్.. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్లతో ఉచితంగా ఇన్సూరెన్స్.. పూర్తి వివరాలు ఇవే!

అసలేం జరిగింది?

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ (బోయింగ్ 737) విమానంలో ఈ దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగా ఒమన్ జాతీయుడైన కో-పైలట్ అకస్మాత్తుగా కెప్టెన్ స్మిత్‌పై పదునైనా ఆయుధంతో దాడి చేసి విమానాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించాడు. కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే విమానం సుమారు 14,000 అడుగుల కిందకు పడిపోయింది. కాక్‌పిట్ నుంచి శబ్దాలు విన్న ప్రయాణికులు, విమాన సిబ్బంది వెంటనే లోపలికి దూసుకెళ్లి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో విమానంలో ఉన్న మరో ఇద్దరు ఫ్లైదుబాయ్ పైలట్లు అప్రమత్తమై విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో విమానంలో ఉన్న 170 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం కెప్టెన్ స్మిత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read: ఎయిర్‌టెల్ vs వీఐ.. ఒకే ధరకు రూ.3,999 వార్షిక ప్లాన్.. ఏది రీఛార్జ్ చేస్తే ఎక్కువ బెనిఫిట్?

Tags

Related News

ఢిల్లీలో హైటెన్షన్.. మెట్రో, ఇంటర్నెట్ సేవలు బంద్.. రంగంలోకి 5 వేల బలగాలు!

సీఎం విజయ్ ఓ అడుగు ముందుకు.. ఉచిత బస్సు ప్రయాణం డీలక్స్ వరకు, మహిళల్లో ఒకటే ఆనందం

లాడ్జిలో ప్రియుడితో ఓ మహిళ.. సుపారీ గ్యాంగ్‌తో భార్య ఎంట్రీ, చివరకు అక్కడ ఏం జరిగిందంటే..

అత్తింట్లో నవ వధువుకు చుక్కలు.. రూ. 50 వేలు ఇస్తే బాత్రూం, చివరకు ఏం జరిగిందంటే

దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 నుంచి 8 వరకు భారీ నిరసనలు.. కారణం ఇదే!

బంధువుతో వివాహేతర బంధం.. అడ్డుగా ఉన్న భర్తను చంపేందుకు.. ఏకంగా భూమిని అమ్మేసిన భార్య!

కెప్టెన్ మచ్చర్‌‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. కో-పైలట్ వివరాలు గోప్యంగా ఉంచుతున్న ఏజెన్సీలు

Big Stories

Advertisement
×