E-Paper
Advertisement

ఢిల్లీలో హైటెన్షన్.. మెట్రో, ఇంటర్నెట్ సేవలు బంద్.. రంగంలోకి 5 వేల బలగాలు!

ఢిల్లీలో హైటెన్షన్.. మెట్రో, ఇంటర్నెట్ సేవలు బంద్.. రంగంలోకి 5 వేల బలగాలు!
Advertisement

Jantar Mantar Protest: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పిలుపునిచ్చిన దేశవ్యాప్త ఆందోళనలతో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటు ఇండియా కూటమి నేతలు సైతం ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో జంతమంతర్ వద్ద నిరసనలు చేపట్టేందుకు తరలివెళ్లడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు జంతర్ మంతర్ ను మూసివేసి.. తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ కు వెళ్లే దారులన్నీ మల్టీ లేయర్ బారికేడ్లతో క్లోజ్ చేశారు.

కార్యకర్తలపై లాఠీచార్జ్

జంతర్ మంతర్ కు వెళ్లే టాల్‌స్టాయ్ మార్గ్, జనపథ్, సంసద్ మార్గ్, అశోకా రోడ్డు పరిసర ప్రాంతాల్లో దాదాపు 5,000 మంది భద్రతా సిబ్బందిని అధికారులు మోహరించారు. ఈ క్రమంలో జంతర్ మంతర్ వద్దకు వెళ్తున్న సీజేపీ కార్యకర్తలు, విపక్ష పార్టీల నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జంతర్ మంతర్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు సౌరభ్ భరద్వాజ్‌తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని తరలించారు. మరోవైపు యూత్ కాంగ్రెస్ నేతలు సైతం ముందుకు దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అడ్డుకోడానికి యత్నించిన కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు.

Advertisement

11 మెట్రో స్టేషన్లు బంద్

మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కీలక నిర్ణయం తీసుకుంది. జనపథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, రాజీవ్ చౌక్, మండి హౌస్, న్యూఢిల్లీ సహా మొత్తం 11 మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు మూసివేసింది. అయితే రాజీవ్ చౌక్, మండి హౌస్, జేఎన్‌ఏ, న్యూఢిల్లీ, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఒక లైన్ నుంచి మరో లైన్‌కు మారే సదుపాయం యథాతథంగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

ఇంటర్నెట్ సేవలు బంద్..

నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో కఠిన ఆంక్షలను విధించారు. BNSS సెక్షన్‌ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. ముందస్తు అనుమతి లేకుండా ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడటం, ర్యాలీలు, ధర్నాలు, నినాదాలు, ప్రసంగాలపై నిషేధం విధించారు. మరోవైపు జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. దీంతో ఊబర్, ఓలా, భారత్ టాక్సీ, ఫోన్ పే, గూగుల్ పే సేవలు ఆగిపోయాయి. ఫలితంగా నిరసనలతో సంబంధం లేని సాధారణ పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read: కెప్టెన్ స్మిత్‌తో ప్రధాని ఫోన్ కాల్.. దేశానికే గర్వకారణమని ప్రశంసలు.. ఏడ్చేసిన పైలట్!

ముంబయి శివాజీ పార్క్‌లో ఉత్కంఠ

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ముంబైలోని శివాజీ పార్క్ లో ఆందోళనకు సీజేపీ వ్యవపస్థాపకుడు అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు. అయితే ఈ నిరసనలకు ముంబయి పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో శివాజీ పార్క్ వద్ద భారీ ఎత్తున బలగాలను మోహరించారు. ఒకవేళ సీజేబీ కార్యకర్తలు నిరసనలకు దిగితే ఎలాంటి ఉత్కంఠ పరిస్థితులు తలెత్తాయోనన్న ఆందోళన ప్రస్తుతం నెలకొంది.

Also Read: ఎయిర్‌టెల్ vs వీఐ.. ఒకే ధరకు రూ.3,999 వార్షిక ప్లాన్.. ఏది రీఛార్జ్ చేస్తే ఎక్కువ బెనిఫిట్?

Tags

Related News

సీఎం విజయ్ ఓ అడుగు ముందుకు.. ఉచిత బస్సు ప్రయాణం డీలక్స్ వరకు, మహిళల్లో ఒకటే ఆనందం

కెప్టెన్ స్మిత్‌తో ప్రధాని ఫోన్ కాల్.. దేశానికే గర్వకారణమని ప్రశంసలు.. ఏడ్చేసిన పైలట్!

లాడ్జిలో ప్రియుడితో ఓ మహిళ.. సుపారీ గ్యాంగ్‌తో భార్య ఎంట్రీ, చివరకు అక్కడ ఏం జరిగిందంటే..

అత్తింట్లో నవ వధువుకు చుక్కలు.. రూ. 50 వేలు ఇస్తే బాత్రూం, చివరకు ఏం జరిగిందంటే

దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 నుంచి 8 వరకు భారీ నిరసనలు.. కారణం ఇదే!

బంధువుతో వివాహేతర బంధం.. అడ్డుగా ఉన్న భర్తను చంపేందుకు.. ఏకంగా భూమిని అమ్మేసిన భార్య!

కెప్టెన్ మచ్చర్‌‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. కో-పైలట్ వివరాలు గోప్యంగా ఉంచుతున్న ఏజెన్సీలు

Big Stories

Advertisement
×