E-Paper
Advertisement

వింటర్ వచ్చేసింది..గీజర్ సర్వీసింగ్ చేయించకుండా ఆన్ చేస్తే భారీ మూల్యం తప్పదు!

వింటర్ వచ్చేసింది..గీజర్ సర్వీసింగ్ చేయించకుండా ఆన్ చేస్తే భారీ మూల్యం తప్పదు!
Advertisement

Geyser servicing before winter: చలికాలం వచ్చేసింది అనగానే గజగజ వణికించే చలి నుంచి రక్షించుకోవడానికి వేడి నీళ్ల స్నానం ఎంతైనా అవసరం.అందుకోసం అందరూ గీజర్‌లను ఆన్ చేయడం ప్రారంభిస్తారు. అయితే.. నెలల తరబడి మూలన పడిన గీజర్‌ను ఎలాంటి చెకింగ్ లేకుండా నేరుగా.. ఆన్ చేయడం ప్రాణాల మీదికి తెస్తుంది.చలికాలానికి ముందు గీజర్‌కు తప్పని సరిగా సర్వీసింగ్ చేయించాలి. లేదంటే.. షార్ట్ సర్క్యూట్, కరెంట్ షాక్ లేదా ట్యాంక్ పేలి పోయే తీవ్రమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అసలు సర్వీసింగ్ ఎందుకు అవసరమో ఇప్పుడు చూద్దాం.

1. ప్రాణాంతకమైన షార్ట్ సర్క్యూట్ , కరెంట్ షాక్:

నెలల తరబడి గీజర్ ట్యాంక్ లోపల తేమ అలాగే ఉండటం వల్ల.. లోపలి వైరింగ్ దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే స్విచ్ ఆన్ చేసిన వెంటనే.. ఓవర్‌లోడ్ అయి సడన్‌గా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది.సర్వీసింగ్ సమయంలో.. ఎలక్ట్రీషియన్ వచ్చి వైరింగ్, ఎర్తింగ్ , థర్మోస్టాట్‌ను పూర్తిగా పరిశీలిస్తారు. దీని వల్ల బాత్‌రూమ్‌లో ఎప్పుడూ లేని విధంగా కరెంట్ షాక్ కొట్టే తీవ్రమైన ప్రమాదం నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.

2. ఉప్పు, చెత్త పేరుకుపోవడం:

Advertisement

మన ప్రాంతంలో కుళాయిల ద్వారా వచ్చే నీటిలో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. గీజర్ పని చేస్తున్నప్పుడు ఈ లవణాలు హీటింగ్ ఎలిమెంట్ చుట్టూ తెల్లటి పొరలా గట్టిగా.. పేరుకుపోతాయి. దీనివల్ల నీరు వేడెక్కడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. అంతే కాకుండా కరెంట్ బిల్లు భారీగా వస్తుంది. చలికాలానికి ముందు డీ-స్కేలింగ్ చేయడం ద్వారా.. హీటింగ్ ఎలిమెంట్ ఆయుష్షు అమాంతం పెరుగుతుంది.

3. ట్యాంక్ లీకేజ్, ట్యాంక్ పేలుళ్ల ప్రమాదం:

గీజర్‌లో ఉండే సేఫ్టీ వాల్వ్ కొన్ని సార్లు ఉప్పు నీటి ప్రభావం వల్ల జామ్ అయిపోతుంది. దీని వల్ల ట్యాంక్ లోపల ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి, గీజర్ పేలిపోయే ప్రమాదం ఉంది. రెగ్యులర్ సర్వీసింగ్ ఉంటే ..ఈ వాల్వ్ సక్రమంగా పని చేస్తుందో లేదో ఎలక్ట్రీషియన్ ముందే పసిగట్టి రిపేర్ చేస్తారు.

Advertisement

Also Read: ఫ్రిజ్ దగ్గర గ్యాస్ సిలిండర్ ఉందా? వెంటనే ఈ తప్పు సరిదిద్దుకోండి!

4. గీజర్ సర్వీసింగ్, రిపేర్ ఖర్చులు ఎంతవుతాయి?

గీజర్ సర్వీసింగ్ చేయించుకోవడం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. కానీ నిర్లక్ష్యం చేస్తే వేల రూపాయల ప్రాణ, ఆస్తినష్టం జరుగుతుంది.

జనరల్ సర్వీసింగ్ ,సేఫ్టీ చెకప్: సుమారు రూ. 300 నుంచి రూ. 500 వరకు ఉంటుంది.

డీ-స్కేలింగ్ , ట్యాంక్ డీప్ క్లీనింగ్: సుమారు రూ. 400 నుంచి రూ. 800 వరకు (ఉప్పు నీరు వచ్చే ప్రాంతాలవారికి ఇది మోస్ట్ ఇంపార్టెంట్).

హీటింగ్ ఎలిమెంట్ లేదా థర్మోస్టాట్ మార్చాల్సి వస్తే.. మోడల్ , బ్రాండ్‌ను బట్టి రూ. 400 నుంచి రూ. 1,500 వరకు ఖర్చు కావచ్చు.

కొద్దిపాటి డబ్బులు, కాస్త సమయం కేటాయించి  గీజర్‌కు పర్ఫెక్ట్ సర్వీసింగ్ చేయించడం ద్వారా మీ ప్రాణాలను, అలాగే.. మీ ఇంటిని పెద్ద పెను ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చు. అంతే కాకుండా ఈ చలికాలంలో.. చన్నీళ్ల.. టెన్షన్ లేకుండా ప్రశాంతంగా, సేఫ్‌గా వేడి నీటిని వాడుకొవచ్చు.

Related News

పాటలు వినొచ్చు, ఫోన్ కాల్స్ మాట్లాడొచ్చు.. హ్యాండ్స్‌ఫ్రీ ఎక్స్‌పీరియన్స్‌తో శాంసంగ్ ఏఐ గ్లాసెస్!

నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?ఇంట్లోనే ఇలా రీసెట్ చేసుకోండి!

ఫ్రిజ్ దగ్గర గ్యాస్ సిలిండర్ ఉందా? వెంటనే ఈ తప్పు సరిదిద్దుకోండి!

సంచలనం సృష్టిస్తున్న Google Pixel 11a లీక్స్.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

ఎయిర్‌టెల్ vs వీఐ.. ఒకే ధరకు రూ.3,999 వార్షిక ప్లాన్.. ఏది రీఛార్జ్ చేస్తే ఎక్కువ బెనిఫిట్?

BSNL సంచలన ఆఫర్.. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్లతో ఉచితంగా ఇన్సూరెన్స్.. పూర్తి వివరాలు ఇవే!

కాలేజ్ స్టూడెంట్స్ కోసం బెస్ట్ బడ్జెట్ ల్యాప్‌టాప్స్.. ఏది కొంటే బెటర్?

Big Stories

Advertisement
×