BigTV English

UP: తండ్రి సేఫ్.. కొడుకు ఫసక్.. సీఎం యోగి మార్క్ ఎన్‌కౌంటర్..

UP: తండ్రి సేఫ్.. కొడుకు ఫసక్.. సీఎం యోగి మార్క్ ఎన్‌కౌంటర్..
up encounter

UP: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్. ఇటీవలే ఆయనకు మరణ శిక్ష పడింది. కోర్టుకు తీసుకొచ్చే సమయంలో తనను ఎన్‌కౌంటర్ చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశాడు. మీడియాలో బ్రేకింగ్ న్యూస్‌లు హోరెత్తడంతో అహ్మద్ బతికిపోయాడు. కట్ చేస్తే, యూపీ పోలీసులు మరో విధంగా షాక్ ఇచ్చారు. అతిక్ అహ్మద్‌ను చంపకుండా వదిలేసినా.. అతని కొడుకు అసద్‌ను ఎన్‌కౌంటర్ చేసి సంచలనంగా నిలిచారు. సీఎం యోగి మార్క్ లా అండ్ ఆర్డర్‌ను మరోసారి రుచిచూపించారు యూపీ పోలీసులు.


ఝాన్సీలో జరిగిన ఎదురుకాల్పుల్లో గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్‌ను పోలీసులు హతమార్చారు. ఎదురుకాల్పుల్లో అసద్ తో పాటు.. అతని అనుచరుడు గులామ్ కూడా చనిపోయాడు. ఉమేశ్ పాల్ మ‌ర్డర్ కేసులో అస‌ద్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ కేసులో అస‌ద్‌పై 5 ల‌క్షల రివార్డు కూడా ఉంది. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఓ మర్డర్ కేసులో.. అసద్ తో పాటు గులామ్ కూడా మోస్ట్ వాంటెడ్ నిందితులుగా ఉన్నారు. ఉమేశ్ పాల్ హత్య కేసు విచారణలో భాగంగా గురువారం మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ అయిన అతీక్ అహ్మద్‌ను ప్రయాగ్ రాజ్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఇటు తండ్రిని కోర్టుకు తీసుకొచ్చిన సమయంలోనే అటు కొడుకును ఎన్‌కౌంటర్‌లో లేపేసి ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు.

బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్‌ హత్యకేసులో.. ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేశ్‌ పాల్‌‌ను.. ఫిబ్రవరి 24న దారుణంగా చంపేశారు. ఆయనతో పాటు ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని కూడా పట్టపగలే కాల్చి చంపారు. ఈ కేసులో మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్‌, ఇద్దరు కుమారులు, ఇద్దరు అనుచరులు, మరో తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. ఉమేశ్ పాల్‌ హత్యకేసులో అతీక్‌ అహ్మద్‌ కుమారుడు అసద్‌ను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.


ఆ హత్య తర్వాత అసద్‌, గులామ్ ఎస్కేప్ అయ్యారు. పోలీసులు వీరి కోసం గాలింపు చేపట్టారు. 5 లక్షల చొప్పున రివార్డులు కూడా ప్రకటించారు. ఈ క్రమంలో అసద్, గులామ్ ఝాన్సీలో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు.. వారిని అరెస్టు చేసేందుకు వెళ్లగా.. ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులపై అసద్ కాల్పులు జరపగా.. ఆత్మసంరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. షూటౌట్‌లో అసద్, గులామ్ చనిపోయారు.

యూపీ సీఎం యోగి పాలనలో న్యాయం ఇలానే అమలవుతుందంటూ అనుకూల, వ్యతిరేఖ కామెంట్లతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. యోగి సీఎం అయ్యాక యూపీలో వందలాది మంది క్రిమినల్స్ ఇలానే ఎన్‌కౌంటర్‌లో పోయారు. ఆ లిస్ట్‌లో ఇప్పుడు అసద్ కూడా చేరాడు. యోగినా మజాకా.

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×