BigTV English

Technique to kill Pests : తెగుళ్లను చంపడం కోసం కొత్త టెక్నిక్..

Technique to kill Pests : తెగుళ్లను చంపడం కోసం కొత్త టెక్నిక్..
Technique to kill Pests

Technique to kill Pests : ఇప్పటికీ ఎన్నో ప్రపంచ దేశాలు వ్యవసాయంపై ఆధారపడి ఉండడంతో టెక్నాలజీ నిపుణులు రైతులకు సాయంగా కొత్త కొత్త టెక్నాలజీలను తయారు చేసి వారికి అందిస్తున్నారు. దానివల్ల పంటలు నాశనం అయ్యే శాతం కొంతవరకు తగ్గింది. అయినా కూడా తెగుళ్లు, పురుగులు వంటివి పంటలను పట్టి పీడిస్తునే ఉన్నాయి. వాటిని అదుపులోకి తీసుకురావడం కోసం శాస్త్రవేత్తలు ముందెన్నడూ లేని కొత్త ప్లాన్‌తో ముందుకొస్తున్నారు.


కొత్త జీన్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ద్వారా పొగాకు చెట్ల రూపం మార్చాలని శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పొగాకు చెట్లకు కెమికల్స్‌ను అంటించి ఆడ తెగుళ్లు.. మగ తెగుళ్ల కోసం ఎదురుచూస్తున్నట్టుగా వాటిని ఏమార్చగలిగితే.. పంటకు తెగుళ్ల బెడద పోతుందని కొత్త ఉపాయంతో శాస్త్రవేత్తలు ముందుకొచ్చారు. ఇలా చేయడం వల్ల కెమికల్స్ కారణంగా తెగుళ్లు చనిపోతాయని, అప్పుడు పంట పెరుగుదలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వారు చెప్తున్నారు.

మామూలుగా ఒక చెట్టుకు తెగుళ్లు పట్టిన తర్వాత అవి మరికొన్ని తెగుళ్లను పిలవడం కోసం ఫెరోమెన్స్ అనే కెమికల్‌ను విడుదల చేస్తాయి. ఇప్పుడు ఫెరోమోన్స్‌ను కృత్రిమంగా తయారు చేయడం వల్ల తెగుళ్లను ట్రాప్ చేసి వాటిని అంతం చేయవచ్చని శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే కెమికల్‌తో దీనిని తయారు చేయడం వల్ల పలు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, అలా కాకుండా వేరే విధాలుగా దీనిని తయారు చేయాలని వారు అనుకుంటున్నారు.


చెట్ల నుండే ఫెరోమోన్స్ విడుదలయ్యేలాగా ఉండాలని శాస్త్రవేత్తలకు ఒక ఆలోచన వచ్చింది. దానికోసమే వారు పొగాక చెట్టును ఈ పరిశోధన కోసం ఎంచుకున్నారు. పొగాకు చెట్టు నుండి తెగుళ్లను ట్రాప్ చేయడం కోసం ఫెరోమోన్స్ విడుదల అయ్యేలాగా శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రయోగం అనేది కేవలం తెగుళ్లను చంపే ఫెరోమోన్స్‌ను విడుదల చేయడం కోసమే కాకుండా మరెన్నో వ్యాధులకు చికిత్సను అందించే విషయంలో కూడా సాయంగా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×