BigTV English

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Life Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరగుతుందన్న వార్తలు గుప్పుమనడంతో ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. బీజేపీ నేత, కేంద్రమంత్రి రవనీత్ సింగ్ బిట్టు, ఎన్డీఏ లీడర్లు రాహుల్ గాంధీని చంపేస్తామని బహిరంగంగానే బెదిరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కేంద్రమంత్రి రవనీత్ సింగ్ ఇంటి వద్ద మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించగా..  అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రవనీత్ సింగ్ ఆఫీసును ముట్టడించేందుకు యత్నించిన వారిని పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు.


రాహుల్ గాంధీని హత్య చేసేందుకు బీజేపీ, బీజేపీ మిత్రపక్ష పార్టీల నేతలు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్.. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో బీజేపీ, బీజేపీ మిత్రపక్షపార్టీ నేతలపై ఫిర్యాదు చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు కూడా ఫిర్యాదు కాపీని పంపించారు.

మరోవైపు తెలంగాణలోనూ కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున నిరసనలు చేస్తున్నారు. కేంద్రమంత్రి రవనీత్ సింగ్ రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు.. ఇతర కాంగ్రెస్ నేతలు సైతం గాంధీ భవన్ లో నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలు సరైనవిగా లేవని, బహిరంగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారాయన. బీజేపీ నేతల తీరును ఖండిస్తూ ధర్నా చేశారు.


Also Read: సాయం లేదు.. సమాచారం లేదు.. వరదల్లో మిస్సయ్యరా?

రాహుల్ గాంధీపై బీజేపీ నేత రవనీత్ సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా ఇతర కాంగ్రెస్ నేతలు.. గాంధీ భవన్ లో నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ నేతల తీరును ఖండిస్తూ ధర్నా చేశారు. రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ మహిళా నేతలు బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు గాంధీ భవన్ వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడటంతో.. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. మోదీ దిష్టిబొమ్మను పార్టీ ఆఫీసు ఎదురుగా దగ్ధం చేశారు.

అటు ఆంధ్రప్రదేశ్ లోనూ కాంగ్రెస్ నేతలు నిరసన బాట పట్టారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విజయవాడలో నిరసన చేపట్టారు. రాహుల్ గాంధీ నిప్పులాంటి మనిషి అని, అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. షర్మిల ధర్నాపై బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కౌంటరిచ్చారు. వివేకా హత్యకేసులో న్యాయం కోసం ఆమె ధర్నా చేస్తే మంచిదని, విదేశీ పర్యటనకు వెళ్లి మన పరువు తీసిన వ్యక్తి కోసం ధర్నా చేస్తే పరువు పోతుందన్నారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×