BigTV English

Sonia Gandhi : సోనియా అలా అనలేదు.. రిటర్మైంట్ పై కాంగ్రెస్ క్లారిటీ..

Sonia Gandhi : సోనియా అలా అనలేదు.. రిటర్మైంట్ పై కాంగ్రెస్ క్లారిటీ..

Sonia Gandhi : రాజకీయాల నుంచి కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వైదొలగుతారనే వార్తలపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఛత్తీస్ గడ్ రాజధాని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాల్లో ప్రసంగించిన సోనియా.. భారత్‌ జోడో యాత్ర విజయవంతం కావడంతో తన ఇన్నింగ్స్‌ ముగిసిందని ప్రకటించారు. దీంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారని అందరూ భావించారు.


సోనియా రాజకీయాల నుంచి తప్పుకున్నారని అన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోనియా రిటర్మెంట్ పై కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. దీంతో ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది. సోనియా గాంధీ వ్యాఖ్యలను మీడియా సంస్థలు తప్పుగా అర్థం చేసుకున్నాయని తెలిపింది. ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగడంలేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటన విడుదల చేసింది.

సోనియా రాజకీయాల్లో నుంచి తప్పుకోవడం లేదని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అల్కా లంబా స్పష్టం చేశారు. సోనియా ప్రసంగంపై ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కథనాలు రాయొద్దని మీడియాను కోరారు. సోనియా కేవలం పార్టీ అధ్యక్ష పదవికి మాత్రమే దూరంగా ఉండాలకుంటున్నారని ఆ విషయాన్నే చెప్పారని లంబా తెలిపారు. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు చెప్పలేదన్నారు. రాజకీయాల నుంచి రిటైర్‌మెంట్‌ వార్తల గురించి వినగానే సోనియా గాంధీ నవ్వారని… తానెప్పుడూ రాజకీయాల నుంచి తప్పుకోలేదని తప్పుకోనని స్పష్టం చేశారని వివరించారు. ఈ విషయాన్ని మీడియా గమనించాలని అల్కా లంబా సూచించారు.


2004, 2009 ఎన్నికల్లో పార్టీ విజయం, మన్మోహన్‌ సింగ్‌ అందించిన సమర్థ నాయకత్వం వ్యక్తిగతంగా సంతృప్తి కలిగించిందని రాయ్ పూర్ సభలో సోనియా చెప్పారు. భారత్‌ జోడో యాత్ర ముగింపుతో తన ఇన్నింగ్స్‌ ముగియడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. దేశ ప్రజలు సామరస్యం, సమానత్వాన్ని కోరుకుంటున్నారని ఈ యాత్ర ద్వారా రుజువైందని చెప్పారు. ప్రజల పక్షాన కాంగ్రెస్‌ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సోనియా రాజకీయాల నుంచి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. దీంతో సోనియా రాజకీయాల నుంచి తప్పుకోవడంలేదని పూర్తి స్పష్టతను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది.

Green Corridor : టాఫ్రిక్ ఇన్‌స్పెక్టర్‌ సమయస్ఫూర్తి .. విద్యార్థి కోసం గ్రీన్ కారిడార్.. ఎందుకంటే..?

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్..మనీష్ సిసోడియా అరెస్ట్..

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×