BigTV English

Anti-EVM Nation Protest : ఈవీఎంలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో నిరసనలు.. అన్ని పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం!

Anti-EVM Nation Protest : ఈవీఎంలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో నిరసనలు.. అన్ని పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం!

Anti-EVM Nation Protest | ఇటీవల ముగిసిన మహారాష్ట్ర ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. బిజేపీ నేతృత్వంలో మహాయుతి కూటమికి ఎవరూ ఊహించని భారీ విజయం దక్కింది. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ సీట్లో 235 సీట్లపై మహాయుతి కూటమి పార్టీల అభ్యర్థుల్లు విజయం సాధించారు. ప్రతిపక్షంలోని మహావికాస్ అఘాడీ కూటమికి అతి కష్టం మీద 49 సీట్లు వచ్చాయి. ఈ ఫలితాలు నమ్మశక్యంగా లేవని దేశ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. దీంతో ఎన్నికల్లో ఈవిఎం మెషీన్ల ట్యాంపరింగ్ జరిగిందని.. అందువల్లే తాము ఓడిపోయామని ప్రతిపక్ష కూటమి పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి.


మహావికాస్ అఘాడీ కూటమిలో భాగమైన కాంగ్రెస్, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రస్ పార్టీ నాయకులు ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్.. ఎన్నికల్లో ఈవిఎంల ట్యాంపరింగ్ జరిగిందని అనుమానాలు వ్యక్తిం చేస్తూ.. ఓటమి చెందిన తమ పార్టీ అభ్యర్థులతో కలిసి బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ తో నిరసనలు చేయాలని భావిస్తున్నారు. దీని కోసం రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి లో లీగల్ టీమ్స్ ఏర్పాటు చేయాలిన అన్ని ప్రతిపక్ష పార్టీలను కోరుతున్నాయి. ఒకవైపు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కోర్టును ఆశ్రయించాలని యోచిస్తున్నాయి.

Also Read: గెలిచినప్పుడు ఈవిఎంలు బాగుంటాయి ఓడిపోతే టాంపర్ చేసినట్లా.. సుప్రీం ఘాటు వ్యాఖ్యలు


దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర తరహాలో ఈవిఎంలకు వ్యతిరేకంగా పాదయాత్ర కూడా కాంగ్రెస్ చేపట్టబోతుందని సమాచారం. కాంగ్రెస్ తలపెట్టిన జాతీయ స్థాయి నిరసనల్లో అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసిరావాలని ఆహ్వానం పలికింది. పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలనే నినాదంతో ఈ నిరసనలు చేపతామని కాంగ్రెస్ అధ్యక్షుడు
మల్లికార్జున ఖర్గే ఇటీవలే ఒక కార్యక్రమంలో తెలిపారు.

హర్యాణా అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ తీరుపై కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. హర్యాణా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఓట్ షేర్ లభించింది. దీంతో ఈవిఎం మెషీన్లు ముందుగానే హ్యాక్ చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ చేసేవన్నీ ఆధారాలు లేని ఆరోపణలని ఎన్నికల కమిషన్ కొట్టిపారేసింది.

మహారాష్ట్ర ఎన్నికల్లో శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ మొత్తం 86 సీట్లలో పోటీ చేయగా.. కేవలం 10 స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఫలితాల పట్ల శరద్ పవార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓడిపోయిన తమ పార్టీ అభ్యర్థులను వివిప్యాట్ స్లిప్పుల ధృవీకరణ చేయాని చెప్పారు. శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ కూడా ఓట్ల కౌంటింగ్ లో మోసం జరిగిందని ఆరోపించారు.

మరోవపు 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ చేతికి కేవలం 16 సీట్లు లభించాయి. ఉద్ధవ్ శివసేన పార్టీ 95 సీట్లపై పోటీ చేస్తే 20 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది.

Also Read: నెలకు లక్ష జీతం ఉన్నా ఈ వరుడు వద్దు.. పెళ్లి మధ్యలో వధువు నిరాకరణ!

అయితే మహావికాస్ అఘాడీ కూటమి చేస్తున్న ఆరోపణలపై బిజేపీ నాయకుడు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా ఖండించారు. ఈవిఎంల ట్యాంపరింగ్ జరగడం నిజమైతే.. ఝార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా గెలిచిందని ప్రశ్నించారు.

ఏప్రిల్ 2024లో కూడా సుప్రీం కోర్టులో ఈవిఎం మెషీన్లలోని ఓట్లను వివిప్యాట్ స్లిప్పులతో వంద శాతం సరిచూసుకునే విధంగా ఆదేశాల ఇవ్వాలని కోరుతూ పిటీషన్ దాఖలైంది. కానీ సుప్రీంకోర్టు ఆ పిటీషన్ విచారణలో ఎన్నికల కమిషన్ తరపునే తీర్పు వెలువరించడం గమనార్హం.

Related News

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Big Stories

×