Bride Demand Groom job| వివాహం నిశ్చయించే క్రమంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. జీవితాంతం దంపతులు కలిసి ఉండాలనే ముందుచూపుతో పెద్దలు అన్ని అంశాలు సరిచూసుకొని తమ పిల్లలకు పెళ్లి నిశ్చయిస్తారు. అయితే చాలా సందర్భాలలో కట్నం కోసమో, లేక ఇతరత్రా కారణాలు చూపి ముహుర్తం సమయంలో పెళ్లిళ్లు ఆగిపోయాయి. అలాంటి ఘటనే ఒకటి తాజాగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. సరిగ్గా వరమాల (పెళ్లి కొడుకు, పెళ్లి కూతరు పూల మాలలు ఒకరిమరొకరు వేసే కార్యక్రమం) పూర్తయ్యాక పెళ్లి కూతురు తనకు ఈ వివాహం ఇష్టం లేదని వెళ్లిపోయింది. దానికి విచిత్ర కారణం చెప్పింది. పెళ్లిలో గొడవ జరిగి పోలీసులు రావాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఫరూఖాబాద్ జిల్లాలో రెండు రోజుల క్రితం ఒక వివాహ వేడుక జరిగింది. ఛత్తీస్ గడ్ రాష్ట్రం బలరామ్ పూర్ ప్రాంతానికి చెందిన యువకుడు ఒక ప్రేవేట్ కంపెనీలో ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు రూ.1.20 లక్షల జీతం. నగరంలో ఆరు ప్లాట్లు, 20 భీగాల వ్యవసాయం భూమి ఆస్తులుగా ఉన్నాయి. ఇంతటి ఆర్థిక సోమత ఉన్నా పెళ్లి కూతురికి ఇవన్నీ సరిపోలేదట.
Also Read: 10 మంది పిల్లల తండ్రితో ప్రేమవివాహం.. ప్రాణహాని ఉందని కోర్టుకెళితే జడ్జి ఫైర్
రెండు రోజుల క్రితం ఆదివారం రాత్రి ఫరుఖాబాద్ లోని ఒక గెస్ట్ హౌస్ కు వరుడు, అతని బంధువులు చేరుకున్నారు. ఆ తరువాత అర్ధరాత్రి వరమాల కార్యక్రమం జరిగింది. ఉదయాన్నే ముహూర్తం ఉంది. దాదాపు రాత్రి 1.15 గంటలకు పెళ్లిలో వధువు అందరిముందు వచ్చి.. “ఈ పెళ్లి జరగదు. ఈ కార్యక్రమాలు ఇంతటితో ఆపండి. పెళ్లికి ముందు వరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఉందని చెప్పారు. కానీ ఆ విషయం అబద్ధమని తేలింది. అందుకే ఈ పెళ్లికి నేను అంగీకరించను” అని చెప్పి వెళ్లిపోయింది. ఇది విని పెళ్లికొడుకు, అతని కుటుంబ సభ్యులు, అక్కడ ఉన్న అతిథులందరూ షాకయ్యారు.
ఇరువైపుల నుంచి దీనిపై చర్చ జరిగింది. ముఖ్యంగా పెళ్లికూతురు తండ్రి, వరుడి తల్లిదండ్రులు ఎలాగైనా వధువుని పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నాలు చేశారు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు. చివరికి పెళ్లి కూతురి తండ్రితో వరుడి తల్లిదండ్రులు బంధువులు గొడవపడ్డారు. కల్యాణ మండపంతో ముహూర్తం వరకు తీసుకువచ్చి పెళ్లి ఆపేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఆర్థిక భద్రత ఉంటుందని పెళ్లి కూతురు వాదించింది.
పెళ్లికిముందు ఉన్న ప్రభుత్వ ఉద్యోగం మానేసి ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తే తప్పేంటని అడిగారు. వరుడు తనకు రూ.1.20 లక్షలు నెల జీతం వస్తోందని అతని సాలరీ స్లిప్ కూడా చూపించాడని సమాచారం. అయినా పెళ్లి కూతురు వివాహానికి అంగీకరించలేదు. ఆర్థికం స్థోమత ఉన్నా.. పెళ్లికి నిరకరించడం సరికాదని గొడవ జరిగింది. గొడవ పెద్దది కావడంతో పెళ్లి కూతరు తండ్రి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని గొడవని ఆపి.. బలవంతంగా వధువుని పెళ్లికి ఒప్పించడం నేరమని తెలిపి.. పెళ్లికొడుకు బంధువులందరినీ అక్కడి నుంచి పంపించేశారు. అయితే తమకు జరిగిన అవమానానికి పరువు నష్టం కేసు వేస్తామని వరుడు బెదిరించాడు.