E-Paper
Advertisement

Tamilnadu : ‘తయిర్’ ముద్దు.. ‘దహీ’ వద్దు.. పెరుగు పేరు మార్పుపై వివాదం..

Tamilnadu : ‘తయిర్’ ముద్దు.. ‘దహీ’ వద్దు.. పెరుగు పేరు మార్పుపై వివాదం..
Advertisement

Tamilnadu : తమిళనాడులో మరో వివాదం రాజుకుంది. ప్యాకెట్లపై పెరుగు పేరును మార్చాలన్న FSSAI నిర్ణయంపై తమిళులు మండిపడుతున్నారు. స్వయంగా సీఎం స్టాలిన్ రంగంలోకి దిగి ఈ నిర్ణయంపై మండిపడ్డారు.

వివాదమేంటి..?
భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ .. FSSAI ఇటీవల తమిళనాడు మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ ఫెడరేషన్‌ కు పెరుగు పేరుపై ఆదేశాలు జారీ చేసింది. పెరుగు ప్యాకెట్లపై ఆంగ్లంలో ఉన్న కర్డ్ , తమిళంలో ఉన్న ‘తయిర్‌ ’ పేర్లను తొలగించి.. ‘దహీ’ అని హిందీలోకి మార్చాలని ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే నెయ్యి, చీజ్‌ లాంటి డైరీ ఉత్పత్తుల పేర్లను ఇలాగే మార్చాలని FSSAI ఆదేశించింది. కర్ణాటకకు కూడా ఇలాంటి ఉత్తర్వులే పంపినట్లు సమాచారం.

Advertisement

స్టాలిన్ ఫైర్..
FSSAI ఇచ్చిన ఆదేశాలపై తమిళనాడులో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని పాల ఉత్పత్తిదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము దహీ అనే పేరును వినియోగించబోమని తమిళనాడు పాల ఉత్పత్తిదారుల సమాఖ్య స్పష్టం చేసింది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ ఆ ఆదేశాలపై మండిపడ్డారు. హిందీని బలవంతంగా రుద్దాలనే వారి పట్టుదల మరింత పెరుగుతోందని విమర్శించారు. చివరకు పెరుగు ప్యాకెట్‌పైనా పేరును మార్చేసి హిందీలో రాయమని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతృభాషలపై ఇలాంటి నిర్లక్ష్యం పనికిరాదని మండిపడ్డారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే వారిని దక్షిణాది శాశ్వతంగా బహిష్కరిస్తుందని స్టాలిన్‌ హెచ్చరించారు.

బీజేపీ రాష్ట్రశాఖ వ్యతిరేకం..
తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కూడా పెరుగు పేరు మార్పు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ప్రాంతీయ భాషాలను ప్రోత్సహించాలన్న ప్రధాని మోదీ విధానాలకు ఈ నిర్ణయం విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

వెనక్కి తగ్గిన FSSAI..
వివాదం మరింత ముదరకముందే FSSAI వెనక్కి తగ్గింది.పెరుగు పేరు మార్పుపై తొలుత ఇచ్చిన ఆదేశాలను సవరించింది.పెరుగు ప్యాకెట్లపై ఆంగ్ల పేరుతోపాటు స్థానిక భాషల పేర్లను బ్రాకెట్లలో పెట్టుకోవచ్చని స్పష్టం చేసింది. మొత్తంమీద తమిళుల ఆగ్రహంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ వెనక్కి తగ్గాల్సివచ్చింది. తమిళులా మజాకా..!

Tags

Related News

2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇంటర్ విద్యార్హతతో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో జాబ్స్

ప్రధాని పర్యటన వేళ కలకలం.. తుపాకీ, నకిలీ గుర్తింపు కార్డుతో ఇద్దరు అరెస్టు

చిరుతను ఢీకొట్టిన కారు.. సాయం కోసం వచ్చిన అధికారిపై దాడి చేసిన క్రూరమృగం.. షాకింగ్ వీడియో!

పరీక్షల్లో 95.7 శాతం మార్కులు.. అయినా స్టూడెంట్ ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే?

ఉపాధ్యాయుల నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. వాళ్ల ఉద్యోగాలు ఔట్!

టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు, అలాంటివారి నో ఛాన్స్

శ్రీవారి దర్శనం తర్వాత బెంగళూరు వెళ్తుండగా.. డివైడర్‌ను ఢీ కొట్టిన కారు, నలుగురు మృతి

విపక్షానికి స్ట్రాంగ్ కౌంటర్.. డబుల్ మీనింగ్స్ వద్దు, చట్టం ఊరుకోదని హెచ్చరించిన సీఎం విజయ్

Big Stories

Advertisement
×