E-Paper
Advertisement

Couple On Photoshoot: ఫోటోషూట్ పిచ్చి, 90 అడుగుల ఎత్తులో బ్రిడ్జి.. కిందకి దూకిన జంట..

Couple On Photoshoot: ఫోటోషూట్ పిచ్చి, 90 అడుగుల ఎత్తులో బ్రిడ్జి.. కిందకి దూకిన జంట..
Advertisement

Couple On Photoshoot: ఫోటోషూట్ పిచ్చి ఆ జంటకు కష్టాలు తెచ్చిపెట్టింది. అందమైన ప్రాంతానికి వెళ్లారు. ఫోటో షూట్ తీసుకున్న సమయంలో మరి ఏం జరిగిందో తెలీదు. అదే రూటులో ట్రైన్ రావడంతో బ్రిడ్జి పైనుంచి కిందకి దూకేసింది ఆ జంట. ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది. భర్త పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

రాజస్థాన్‌లోని బాగ్దీనగర్‌‌కు చెందిన కొత్త జంట రాహుల్-జాహ్నవి దంపతులు.. చెల్లెలు-బావతో కలిసి విహార యాత్రకు వెళ్లారు. పాలిలోని పురాతన రైల్వే బ్రిడ్జి వద్ద లొకేషన్ బాగుంది. చుట్టు పచ్చని చెట్లు.. మధ్యలో రైల్వే ట్రాక్.. పెద్ద బ్రిడ్జి ఫోటోలకు బాగుంటుందని భావించారు. తమ సెల్‌ఫోన్లకు పని కల్పించారు. మీటరు గేజ్ రూట్ కావడంతో ట్రాక్‌పై నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

Advertisement

ఇంతలో ఆ ట్రాక్ పైకి రైలు వస్తోంది. బ్రిడ్జికి మధ్యలో జంట ఉండిపోవడంతో అటు ఇటు వెళ్లలేక పోయింది. రాహుల్ చెల్లెలు-బావ ఆ రైలు నుంచి తప్పించుకున్నారు. రైలు రాకను గమనించిన రాహుల్-జాహ్నవి జంట భయంతో తమ ప్రాణాలు కాపాడుకోవాలని బ్రిడ్జి పైనుంచి లోయలోకి దూకేశారు.

ఆ జంట ప్రాణాలు కాపాడుకుంది. కానీ రాహుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. వెన్ను ముకకు తీవ్ర గాయమైనట్లు తెలిపారు. జాహ్నవికి కాలు విరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఘటనపై అజ్మీర్ రైల్వే డివిజన్ అధికారులు నోరువిప్పారు.

Advertisement

ALSO READ: ప్రపంచ నేతల్లో మోదీయే టాప్.. ఎక్స్‌లో 100 మిలియన్ల ఫాలోవర్స్

లోకో పైలట్ బ్రేకులు వేయడంతో ఆ ప్రాంతానికి చేరుకోగానే రైలు ఆగిపోయిందన్నది వాళ్ల వెర్షన్. భయంతో ఆ జంట లోయలోకి దూకారని చెబుతున్నారు. నార్మల్‌గా ట్రైన్ వస్తే పెద్ద సౌండ్ వస్తుంది.. అది తెలిసి కూడా రాహుల్ దంపతులు బ్రిడ్జిపై ఎందుకు వెళ్లారన్నది అసలు ప్రశ్న.

 

Tags

Related News

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

Big Stories

Advertisement
×