BigTV English

YS Jagan: జగన్ ఇలాకాలో కల్లోలం సృష్టిస్తున్న.. వైసీపీ కబ్జా కహానీలు..

YS Jagan: జగన్ ఇలాకాలో కల్లోలం సృష్టిస్తున్న.. వైసీపీ కబ్జా కహానీలు..

కడప మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని ఇందిరానగర్‌లో వైసీపీ నేతలు అడ్డుఅదుపూ లేకుండా భూకబ్జాలకు పాల్పడ్డారు. వైసీపీకి చెందిన కీలక నేతలు రెవెన్యూ అధికారులు, కార్పొరేషన్ సిబ్బంది సహకారంతో నిర్వహించిన కోట్ల రూపాయల దందాలు ఒకొటొకటిగా వెలుగుచూస్తూ కలకలం రేపుతున్నాయి.

ఇందిరానగర్ సహా పరిసర ప్రాంతాల్లోని మామిళ్లపల్లె రెవెన్యూ స్థలాల్లో వందల కోట్ల విలువైన ప్రభుత్వ డీకేటీ, వివాదాస్పద భూములు చాలా ఉన్నాయి. సదరు స్థలాలకు వైసీపీ నేతలతో కుమ్మక్కైన సిబ్బంది బోగస్ పట్టాలు ఇచ్చారంట. ఆ ఫేక్ సర్టిఫికేట్లతో సదరు స్థలాల్లో లే అవుట్లు వేసిన వైసీపీ నేతలు కోట్ల రూపాయల రియల్ వ్యాపారం నిర్వహించారు. ఒక్క ఇందిరానగర్ లోనే వందకు పైగా ఇంటి స్థలా లను అమ్మినట్లు ప్రాథమికంగా వెలుగు చూసింది.


ఇందిరానగర్ ఎంట్రన్స్‌లో ప్రభుత్వ అవసరాలకు ఉంచిన దాదాపు రూ. 3 కోట్లు విలువైన ఎకరం స్థలాన్ని కొందరు వైసీపీ నేతలు దక్కించుకుని  ఒకటి ముక్కాల్ సెంటు ప్లాట్ రూ.3 నుంచి 4 లక్షలకు అమ్మి సొమ్ముచేసుకున్నట్లు జోరు గా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వైసీపీ వారి అక్రమాలు వెలుగు చూస్తూ.. అక్కడ ప్లాట్లు కొనుగోలుచేసిన వారు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుంది

ఇందిరానగర్ యానాదుల కాలనీ, స్పోర్ట్స్ స్కూల్ మధ్య రింగ్ రోడ్డు సమీపంలో దాదాపు రెండెకరాల వరకు ఫారెస్టు బఫర్ ల్యాండ్ ఉంది. ఆ స్థలం రిమ్స్ హాస్పటల్‌కి అతి సమీపంలో ఉండడంతో సెంటు స్థలం 2 లక్షలకు పైగా ధర పలుకుతుంది. రూ. 4 కోట్ల విలువైన ఆ స్థలంలో వైసీపీ కీలక నేతలు, అధికా రులు కలిసి అక్రమ కట్టడాలు నిర్మింపచేశారు. ఒక్కో కట్టడం నుంచి లక్ష నుంచి 2 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఒక వేళ వారు డిమాండ్ చేసిన మొత్తంలో డబ్బు ఇవ్వ కపోతే వీఆర్ఓను పంపించి సదరు నిర్మాణాలను కూల్చివేస్తూ వచ్చారు. ఈ తతంగం తరువాత వైసీపీ నేతలే కార్పొరేషన్ సిబ్బందిని రంగంలోకి దించి అక్రమ కట్టడాలకు ఇంటిపన్ను, కుళాయి కనెక్షన్, కరెంట్ మీటర్లను ఏర్పాటు చేయించి మరో 50వేలను అదనంగా వసూలు చేశారంట.

Also Read: జగన్ మళ్లీ బెంగుళూరు ఎందుకు.. మకాం మార్చినట్టేనా?

ఇంటిపట్టాల దందా అంతా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా అనుచరుల కనుసన్నల్లోనే సాగిందంటున్నారు.. వారు కన్నుపడిన డీకేటి స్థలానికి రేటు కుదుర్చుకుని. ఆ కొనుగోలుదారుడ్ని రెవెన్యూ అధికారి వద్దకు పంపేవారంట. సదరు అధికారి తన కింద పనిచేసే సిబ్బందికి పనిని అప్పగించేవాడు. సిబ్బంది ఆ డీకేటీ అధికారుల సంతకాలు,రెవెన్యూ సీల్ తో ఇంటి పట్టా ఇస్తాడు. ఆ దొంగ పట్టా కసం 30 వేలు వసూలు చేశేవారంట. ఆ ఇంటిపట్టాను పరిశీలిస్తే రెవెన్యూ రికార్డులతో సంబంధం ఉండదు. అలాంటి బోగస్ పట్టాలు ఇందిరానగర్‌లో ఎన్ని ప్లాట్లు అమ్మారో లెక్కతేలాల్సి ఉంది.

కొందరు రెవెన్యూ అధికారులు వైసీపీ నేతలతో అంటకాగి ఇష్టానుసారంగా రెవెన్యూ రికార్డులతో సంబంధం లేకుండా ప్రభుత్వ స్థలాలను, భూములను ఇష్టం వచ్చినట్లు ధారాదత్తం చేశారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారం లోకి రావడంతో వాటి చిట్టాను బయటికి తీస్తున్నారట. దీంతో బాధ్యులైన అధికారులు తమ బాగోతం ఎక్కడ భయటపడుతుందోనని గాభరా పడుతున్నారట.

ఇందిరా నగర సమీపంలో ఫారెస్ట్ కు సంబంధించిన దాదాపు 45 ఎకరాలను చదును చేసి మరి ఫ్లాట్లుగా విభజించిన వైసీపీ నేతలు పెద్ద ఎత్తున్న సొమ్ము చేసుకున్నారంట. వారికి అన్ని విధాలా సహకరించిన అధికారులు ఇప్పుడు దానిపై నోరు మెదపడానికి భయపడుతున్నారు. వందల కోట్ల విలువచేసే ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్ముకున్న నేతలు ఇప్పుడు తమ భండార బయటపడే పరిస్థితి ఏర్పడటంతో జనానికి ముఖం చాటేస్తున్నారు. ఇటువంటి భూదందాలు కడప నుంచి బద్వేలు వరకు చాలా జరిగాయని వాటన్నిటిపై విచారణ జరిపించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

గత అయిదేళ్లలో వైసీపీ నేతల భూ దందలపై ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో  నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిన కూటమి నేతలు ఇప్పుడు వారి భాగోతాలపై కూపీ లాగుతున్నారు. ఉన్నతాధికారులు ఎక్కడెక్కడ వైసీపీ నేత రియల్ అక్రమాలు జరిగాయో ఆరా తీసుతున్నారంట. మరి ఈ అక్రమాలపై విచారణలో ఎన్ని పెద్ద తలకాయలు బయటపడతాయో చూడాలి.

Tags

Related News

AP Dairy Farmers: పాడి రైతులకు గుడ్ న్యూస్.. పశుగ్రాసం సాగుకు 100% రాయితీ.. దరఖాస్తు ఇలా!

Anantapur Land Grab: అనంతపురంలో అదుపులేని భూ కబ్జాలు.. అధికార పార్టీ నేతపై ఆరోపణలు

Gudivada Amarnath: వైఎస్ జగన్ పర్యటన జరిగి తీరుతుంది.. ఎవరు ఆపుతారో చూస్తాం: గుడివాడ అమర్నాథ్

Vizianagaram Sirimanotsavam: సిరిమానోత్సవంలో అపశృతి.. బొత్స కి తప్పిన ప్రమాదం

Tidco Houses: టిడ్కో ఇళ్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వచ్చే జూన్ నాటికి కంప్లీట్

YCP Politics: వైసీపీ డిజిటల్ బుక్.. సొంత నేతలకు సెగ, డైలామాలో వైసీపీ అధిష్టానం?

Vizianagaram Pydithalli: విజయనగరంలో ఘనంగా పైడితల్లి అమ్మవారి జాతర..

YS Jagan: నేడు వైసీపీ కీలక సమావేశం.. పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో జగన్‌ మీటింగ్

Big Stories

×