Craniotomy : ఆపరేషన్ థియేటర్ లో పేషంట్ కు ఆపరేషన్ చేసేముందు.. ఆ నొప్పి తెలియకుండా ఉండేందుకు అనస్తీషియా ఇవ్వడం తప్పనిసరి. కానీ కొన్నిసార్లు మత్తు ఇవ్వకుండానే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అలాంటి క్లిష్టమైన ఆపరేషన్లలో క్రానియోటమీ ఒకటి. ఈ ఆపరేషన్ చేసేటపుడు పేషంట్ పూర్తి స్పృహతో ఉండాలి. మేల్కొని ఉంటేనే మెదడు పనితీరును పర్యవేక్షించే వీలుంటుంది. ఇలాంటి ఆపరేషన్లు చేసేటపుడు వైద్యులు.. పేషంట్లకు ఇష్టమైన పనులు చేస్తుంటారు. వాటిలో ప్రధానంగా మ్యూజిక్ ఒకటి. పేషంట్ కు నచ్చే పాటలు పెడుతుంటారు. లేదా నచ్చిన సినిమా ప్లే చేస్తారు. అలా ఓ యువకుడికి క్రానియోటమీ ఆపరేషన్ చేసేందుకు మెలొడీ పాటలు ప్లే చేయగా.. ా పాటలకు మ్యూజిక్ ప్లే చేశాడు ఆ పేషంట్. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. ఎయిమ్స్ లో వైద్యులు ఓ యువకుడికి క్రానియోటమీ ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో వైద్యులు ఆ యువకుడికి పరిస్థితిని వివరించారు. అయితే తనకు సంగీత వాయిద్యాలు కావాలని అడగటంతో.. వైద్యులు ఆపరేషన్ థియేటర్లో సింథసైజర్ ను ఏర్పాటు చేశారు. సింథసైజర్ పై అతను మెలొడీ పాటలు ప్లే చేస్తూ ఆపరేషన్ చేయించుకున్నాడు. వైద్యులు సక్సెస్ ఫుల్ గా అతని బ్రెయిన్ లో కణితను తొలగించారు. ఇంతక్లిష్టమైన ఆపరేషన్ ను పూర్తి స్పృహతో చేయించుకున్న అతని ధైర్యానికి వైద్యులు ఫిదా అయి అభినందనలు తెలిపారు.