IPL : సౌదీ అరేబియా ఐపీఎల్ పై కన్నేసింది. బిలియన్ డాలర్ వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ సలహాదారులు ఐపీఎల్‌ను 30 బిలియన్ల డాలర్ల విలువైన హోల్డింగ్ కంపెనీలోకి తరలించే అవకాశం గురించి చర్చించారని తెలుస్తోంది.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం ఈ ప్రక్రియ వాస్తవ రూపం దాలిస్తే.. సౌదీ అరేబియా బిలియన్ డాలర్ల విలువైన వాటాను తీసుకోవచ్చు. ఈ చర్చలు సెప్టెంబర్‌లో సౌదీ ప్రిన్స్ భారత్ లో పర్యటించినప్పుడు జరిగాయని నివేదిక పేర్కొంది.
సౌదీ అరేబియా 5 బిలియన్ల డాలర్ల వరకు పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదించిందని సమాచారం. భారత ప్రభుత్వం , బీసీసీఐ వచ్చే ఏడాది ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. బీసీసీఐ అంగీకరిస్తే సౌదీ అరేబియా ఈ ఒప్పందంతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
ఐపీఎల్‌కు ఇప్పటికే అరామ్‌కో , సౌదీ పర్యాటక సంస్థ స్పాన్సర్‌లుగా ఉన్నాయి. ఐపీఎల్ ప్రజాదరణకు నిదర్శనంగా గతేడాది బిడ్డర్లు టోర్నమెంట్‌లను ప్రసారం చేసే హక్కుల కోసం 6.2 బిలియన్లు డాలర్లు పెట్టుబడి పెట్టారు. ఇది మ్యాచ్‌కు 15.1 మిలియన్లు ఇస్తుంది. ఈ ఆదాయం ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కంటే ఎక్కువ. US నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ కంటే కాస్త తక్కువ. ఐపీఎల్‌లో సౌదీ పెట్టుబడి పెడితే లీగ్ కోసం మీడియా హక్కుల ఒప్పందాలను మార్చాల్సి ఉంటుంది.
సత్య నాదెళ్ల , శంతను నారాయణ్‌లు పాక్షికంగా నిధులు సమకూర్చిన US అప్‌స్టార్ట్ ఇటీవల జూలైలో తన మొదటి సీజన్‌ను ముగించింది. UAE , దక్షిణాఫ్రికాలో కూడా ఇలాంటి లీగ్‌లు ఉన్నాయి.