BigTV English

BJP Protest in Delhi: నిరసనకు దిగిన బీజేపీ.. ‘కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలి’!

BJP Protest in Delhi: నిరసనకు దిగిన బీజేపీ.. ‘కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలి’!
BJP Protest
BJP Protest

BJP Protest in Delhi: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కారణంగా దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతోంది. గత మూడు రోజులుగా ఆప్ శ్రేణులు ఢిల్లీ అంతటా ఆందోళనలు చేపడుతున్నారు. అయితే ఈ రోజు కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు కూడా నిరసనకు దిగాయి. సీఎం కేజ్రీవాల్ వెంటనే తన సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ నిరసన చేపట్టారు.


మంగళవారం ఢిల్లీ అటు ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీల ఆందోళనలతో దద్దరిల్లింది. ఇరు పార్టీలు ఢిల్లీ అంతటా ఆందోళనలతో అట్టుడుకుంతోంది. అవినీతి ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ శ్రేణులు నిరసన చేపడుతున్నారు. అయితే గత మూడు రోజులుగా ఆప్ నేతలు సీఎం కేజ్రీవాల్ ను బీజేపీ, ఈడీ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసిందని ఆరోపిస్తూ.. దేవవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

మూడు రోజులుగా నిరసన చేపడుతున్న ఆప్ శ్రేణులను మంగళవారం ఉదయం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటుగా కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటూ ఆందోళనలు చేపడుతున్న బీజేపీ శ్రేణులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ కూడా ఉన్నారు.


Also Read:

కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో మనీలాండరింగ్ కు పాల్పడ్డారంటూ ఈడీ అధికారులు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆయన అవినీతి ఆరోపణల కేసులో జైలులో ఉంటూనే.. తన పదవికి రాజీనామా చేయకుండా అక్కడ నుంచే ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది.

Tags

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×