E-Paper
Advertisement

Delhi Bomb Threat: ఢిల్లీలో ఎర్రకోట, అసెంబ్లీల‌కు బాంబు బెదిరింపులు.. గంటల తరబడి ముమ్మర తనిఖీలు

Delhi Bomb Threat: ఢిల్లీలో ఎర్రకోట, అసెంబ్లీల‌కు  బాంబు బెదిరింపులు.. గంటల తరబడి ముమ్మర తనిఖీలు
Advertisement

Delhi Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టించాయి. చారిత్రక కట్టడమైన ఎర్రకోట, ఢిల్లీ అసెంబ్లీ భవనానికి బాంబు పెట్టినట్లు వచ్చిన సమాచారంతో భద్రతా దళాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఈ బెదిరింపుల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందాలు ఆయా పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి ముమ్మర తనిఖీలు నిర్వహించాయి. అత్యాధునిక పరికరాలు, జాగిలాల సాయంతో అణువణువూ గాలించిన అధికారులు.. అక్కడ ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు గుర్తించలేదని అధికారికంగా ధృవీకరించారు. ఇవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని తేలడంతో అధికారులు, పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు.

కేవలం ఈ రెండు ప్రాంతాలే కాకుండా ఉదయం ఢిల్లీలోని పలు పాఠశాలలకు కూడా ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. ఈ వరుస సంఘటనల వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో పోలీసులు లోతైన విచారణ ప్రారంభించారు. సైబర్ క్రైమ్ విభాగం సాయంతో మెయిల్స్ పంపిన మూలాలను ఆరా తీస్తున్నారు. కాగా నిన్న జమ్మూకాశ్మీర్‌లో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో వరుస బెదిరింపులు రావడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రతా పరంగా రాజధానిలో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు.

Advertisement

Read Also: Jamili : తెలంగాణలో జమిలి.. ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్?

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×